జీఐఎస్ మ్యాపింగ్ లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ప్రాపర్టీలు, ఇతరత్రా నిర్మాణాలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సర్వే ప్రారంభమైంది. ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, మియాపూర్, చందానగర్ సర్కిళ్లలో మొదలైన ఈ సర్వే.. క్రమంగా నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.
సర్వేలో భాగంగా ఇంటికి వచ్చిన సిబ్బందికి ప్రాపర్టీ యజమానులు భవన అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, తాజాగా చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, యజమాని గుర్తింపు కార్డు, వాణిజ్య భవనాలకు ట్రేడ్ లైసెన్స్ నంబర్ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా వివరాలను జీహెచ్ఎంసీ గోప్యంగా ఉంచుతుంది