ఏ రాష్ట్ర రాజధానికైనా దశా-దిశా మార్చేవి రోడ్లే. అమరావతిలో కనెక్టివిటీ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి విపరీతమైన ప్రాధాన్యమిచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, నేషనల్ హైవేస్‌తో కనెక్టివిటీ.. ఇన్నర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్లు, విజయవాడకి మెట్రో ప్రతిపాదనలు కొలిక్కి వస్తే ఆటోమోటిగ్గా రియల్ ఎస్టేట్ బూమ్ రావడం ఖాయం. ధరల నియంత్రణ వ్యాపారుల చేతుల్లో లేదని.. భూముల ధరలు, లేబర్, నిర్మాణ సామాగ్రి ఖర్చులు పెరిగిపోయాయని ఆ ప్రభావం ఆస్తుల కొనుగోలు సమయంలో కనిపిస్తుందంటున్నారు. అయినప్పటికీ.. మిగిలిన రాష్ట్రాలతో పొల్చితే అమరావతిలో ఇప్పటికీ భూముల ధరలు అందుబాటులో ఉన్నాయని.. అపార్టమెంట్లలో ఫ్లాట్లు, లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నరెడ్కో ప్రతినిధులు. అమరావతి నిర్మాణ పనులు మొదలయ్యాక ధరలు పెరిగే అవకాశముందంటున్నారు.