poulomi avante poulomi avante

కొల్లూరులో సూప‌ర్ విల్లా క‌మ్యూనిటీ

  • ద మెజెస్టిక్ విల్లాస్, కొల్లూరు
  • 7.1 ఎక‌రాలు.. 45 విల్లాలు..
  • బెస్ట్ ల‌గ్జ‌రీ విల్లా క‌మ్యూనిటీ

కోకాపేట్ త‌ర్వాత అభివృద్ధి చెంద‌డానికి ఆస్కార‌మున్న ప్రాంతమైన కొల్లూరులో ప్ర‌త్యూష డెవ‌ల‌ప‌ర్స్ ఆరంభించిన స‌రికొత్త విల్లా క‌మ్యూనిటీయే.. ద మెజెస్టిక్ విల్లాస్‌. ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ ఏమిటంటే.. గండిపేట్‌కు చేరువ‌గా ఉంటుంది. కొల్లూరు గేటు నుంచి మోకిలా, శంక‌ర్‌ప‌ల్లి రోడ్డు మీదుగా వెళితే 1.75 కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ హై ఎండ్ ప్రాజెక్టుని డెవ‌ల‌ప్ చేస్తోంది. ఔట‌ర్ రింగ్ రోడ్డు మీద నుంచి కొల్లూరు ఎగ్జిట్ 2 వ‌ద్ద దిగితే.. అక్క‌డ్నుంచి సుమారు 3.25 కిలోమీట‌ర్ల‌లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవ‌చ్చు. ప్ర‌పోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీదే ఈ విల్లా ప్రాజెక్టును సంస్థ డెవ‌ల‌ప్ చేస్తోంది. మ‌రోవైపు, 40 అడుగుల రోడ్డు మీద‌.. ఎలివేటెడ్ లొకేష‌న్లో ఉంటుంది. మొత్తానికి, ప్ర‌తిపాదిత కొల్లూరు ఎస్ఈజెడ్‌కు స‌మీపంలో ద మెజెస్టిక్ విల్లాస్‌ను ప్ర‌త్యూష డెవ‌ల‌ప‌ర్స్ డెవ‌ల‌ప్ చేస్తోంది. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, కోకాపేట్‌ల నుంచి ఔట‌ర్ రింగ్ రోడ్డుతో పాటు స‌ర్వీస్ రోడ్డు మీదుగా కూడా ఈ ప్రాజెక్టుకు చేరుకోవ‌చ్చు.

గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో ప‌ని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొల్లూరు నుంచి సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. అంతెందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఫైనాన్షియ‌ల్ సెక్టార్‌లో ప‌ని చేసే ఉద్యోగులు.. ఎంచ‌క్కా సైకిల్ ట్రాక్ మీదుగా రోజు త‌మ ఆఫీసుల‌కు చేరుకోవ‌చ్చు. ఇక్క‌డ్నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యం అయినా.. న‌గ‌రంలోని ఏ ఇత‌ర ప్రాంత‌మైనా.. ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదుగా సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. కొల్లూరు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఈ ప్రాంతం కాలుష్య‌ర‌హితంగా ఉంటుంది. భూగ‌ర్భ‌జ‌లాల‌కు కొద‌వే ఉండ‌దు. కాబ‌ట్టి, ప్ర‌శాంతంగా నివ‌సించాల‌ని కోరుకునేవారికి.. ఈ లిమిటెడ్ ఎడిష‌న్ విల్లాస్ మంచి ఆప్ష‌న్ అని చెప్పొచ్చు. ఇందులోని క్ల‌బ్ హౌజ్‌ను సుమారు ప‌దివేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో డెవ‌ల‌ప్ చేస్తున్నారు.
హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో మూడు ద‌శాబ్దాల అనుభ‌వం గ‌ల గౌత‌మీ డెవ‌ల‌ప‌ర్స్ సంస్థ‌.. అనేక అపార్టుమెంట్లు, గేటెడ్ క‌మ్యూనిటీలు, విల్లా క‌మ్యూనిటీల‌ను విజ‌య‌వంతంగా కొనుగోలుదారుల‌కు అప్ప‌గించింది. ఈ సంస్థ తాజాగా ప్ర‌త్యూష డెవ‌ల‌ప‌ర్స్ పేరు మీద 7.1 ఎక‌రాల్లో 45 లిమిటెడ్ ఎడిష‌న్ విల్లాల‌ను నిర్మిస్తోంది. ఒక్కో విల్లా ప్లాటు సైజు 477 నుంచి 524 గ‌జాల్లో ఉండ‌గా.. బిల్ట‌ప్ ఏరియా విష‌యానికొస్తే.. ఆరు వేల ఏడు వంద‌ల నుంచి ఆరు వేల తొమ్మిది వందల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తుంది. ఇప్ప‌టికే కొన్ని విల్లాల‌కు సంబంధించిన శ్లాబుల ప‌ని ఆరంభ‌మ‌య్యాయ్‌. ఈ ప్రాజెక్టును 2026 డిసెంబ‌రులోపు హ్యాండోవ‌ర్ చేయ‌డానికి సంస్థ ప్లాన్ చేస్తోంది.
ద మెజెస్టిక్ ల‌గ్జ‌రీ విల్లాస్ యూఎస్‌పీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అని చెప్పొచ్చు. కొల్లూరులో ఇదొక బెస్ట్ విల్లా ప్రాజెక్టుగా ప్ర‌త్యూష డెవ‌ల‌ప‌ర్స్ డిజైన్ చేసింది. ల్యాండ్ స్కేపింగ్ కూడా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దింది. విల్లా ఫ్లోర్ హైట్‌ను ట్వ‌ల్వ్‌ ఫీట్‌, ప్ర‌తి మెయిన్ డోర్‌ను ఎయిట్ ఫీట్ ఎత్తులో ప్లాన్ చేసింది. దీని వ‌ల్ల ఇందులో ఫ్లాట్లు కొన్న‌వారికి పాజిటివ్ అనుభూతి ల‌భిస్తుంది. ఫ్లోరింగ్ కోసం మార్బుల్‌ను వినియోగిస్తుంది. ఒక యూనిక్ అంశ‌మేమిటంటే.. ఇవ‌న్నీ కూడా ఫైవ్ బెడ్‌రూమ్ విల్లాస్గా డెవ‌ల‌ప్ చేస్తోంది. లిఫ్టుకు ప్రొవిజ‌న్ క‌ల్పిస్తోంది. ఇందులో విల్లా కొంటే.. ఆఫీస్ రూమ్‌, హోమ్ థియేట‌ర్‌, ప‌ర్స‌న‌ల్ జిమ్ వంటివి ఏర్పాటు చేసుకోవ‌చ్చు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మేమిటంటే.. కిచెన్‌ను రెండు విభాగాలుగా చేసి.. వెట్ కిచెన్‌, డ్రై కిచెన్‌లుగా డిజైన్ చేశారు. స‌ర్వెంట్ క్వార్ట‌ర్స్ కు కూడా స్థానం క‌ల్పించారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles