Categories: LATEST UPDATES

డిజిటల్ బాటలో నిర్మాణ సంస్థలు

ప్రాజెక్టు డెలివరీ, ఇతరత్రా సవాళ్లను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ వినియోగం

దేశంలోని నిర్మాణ సంస్థలు డిజిటల్ టెక్నాలజీ బాట పట్టాయి. సకాలంలో ప్రాజెక్టు డెలివరీ చేయడంలో సహకరించడంతోపాటు రియల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న నిర్మాణ మెటీరియల్ ధరలు, లేబర్ వ్యయాల పెరుగుదల వంటి సవాళ్లను అధిగమించేందుకు డిజిటల్ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి. ఇందుకోసం అవసరమైన అన్ని కొత్త సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. డేటా విశ్లేషణతోపాటు క్లౌడ్ సాఫ్ట్ వేర్, మొబైల్ అప్లికేషన్ వంటివాటి సాయంతో ప్రాజెక్టును సమర్థంగా నిర్వహిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, మలేసియా, హాంకాంగ్ మార్కెట్లలోని 933 నిర్మాణ సంస్థలపై అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. ఒక్కో సంస్థ సగటున 5.3 సాంకేతికతలను వినియోగిస్తున్నట్టు తేలింది. ఇక కొత్త సాంకేతికతలను వినియోగించే విషయంలో భారత్ దూకుడుగానే ఉన్నట్టు వెల్లడైంది. కొత్త సాంకేతికతల కోసం వినియోగించే మొత్తం విషయంలో 28 శాతం ఇందుకోసం భారత్ వినియోగిస్తోంది. ఇది ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ కంటే ఎక్కువ. రొబోటిక్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్, ఆగ్ మెంటెడ్ వర్చువల్ రియల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను భారత్ ఎక్కువగా వినియోగిస్తోంది.

This website uses cookies.