Categories: LATEST UPDATES

కార్మికుల‌కు డెంగీ

హైద‌రాబాద్ నిర్మాణ రంగాన్ని డెంగీ ప‌ట్టిపిడిస్తోంది. ఒక‌వైపు వ‌ర్షాలు ప‌డుతుండ‌టం.. మ‌రోవైపు అదే సైటులో భ‌వ‌న నిర్మాణ కార్మికులు ప‌ని చేస్తుండ‌టంతో.. డెంగీ దోమ‌లు కుట్టి భ‌వ‌న నిర్మాణ కార్మికులు అనారోగ్య‌పాల‌వుతున్నారు. పైగా, ఈ సైట్ల‌లో రోజుల త‌ర‌బ‌డి వ‌ర్షపు నీరు నిలిచిపోవ‌డం డెంగీ దోమ‌ల‌కు ఆవాసంగా మారింది. డెంగీ దోమ‌లు సుమారు 25 నుంచి 35 రోజులు జీవిస్తే.. ఒక్క‌సారి వెయ్యి గుడ్లు చొప్పున ఐదు సార్లు పెడుతుంది. చూడ‌టానికి చిన్న‌గానే క‌నిపించినా, ఇవి మ‌నుష్యుల్ని తీవ్రంగా న‌ష్ట‌ప‌రుస్తాయి. కాబ‌ట్టి, నిర్మాణ సంస్థ‌లు సైట్ల‌లో డెంగీ దోమ‌ల్లేకుండా చూసుకుంటే.. కార్మికుల్ని కాపాడుకున్న‌ట్లు అవుతుంది. ఇందుక‌య్యే ఖ‌ర్చు పెద్ద‌గా ఎక్కువేం ఉండదు.

This website uses cookies.