Categories: LEGAL

మానసిక వేదనకు.. రూ.1.35 లక్షల పరిహారం

  • చెల్లించాలని డీఎల్ఎఫ్ కు
    వినియోగదారుల కమిషన్ ఆదేశం

ఫ్లాటు అప్పగింతలో తీవ్రమైన జాప్యం చేయడంతో మానసిక వేదనకు గురైన జంటకు రూ.1.35 లక్షల పరిహారం చెల్లించాలని డీఎల్ఎఫ్ హోమ్స్ ను చండీగఢ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు మాజీ లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్, ఆయన భార్య అనితా సింగ్ కు.. ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఒకవేళ 30 రోజుల్లో చెల్లించన పక్షంలో అప్పటి నుంచి ఆ మొత్తాన్ని చెల్లించే వరకు 9 శాతం వడ్డీ ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా వారు కొనుగోలు చేసిన యూనిట్ కు సంబంధించిన సేల్ డీడ్ ను కూడా 30 రోజుల్లోగా అనితా సింగ్ పేరుతో చేసి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఫిర్యాదుదారు సేల్ డీడ్ కోసం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉన్న పక్షంలో అవి చెల్లించిన నాటి నుంచి 30 రోజుల గడువు వర్తిస్తుందని పేర్కొంది. 2010లో పంచకులలోని డీఎల్ఎఫ్ వ్యాలీలో అనితాసింగ్ దంపతులు కొనుగోలు చేశారు. అయితే, నిర్దేశిత గడువులోగా సంస్థ దానిని అప్పగించలేదు. ఈ నేపథ్యంలో బాధితులు వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు.

This website uses cookies.