Categories: TOP STORIES

కూల్ రూఫ్ పాల‌సీ అమ‌లు చేస్తేనే ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్

  • Cool Roof Policy Is mandatory For Hyderabad Builders
    మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం

తెలంగాణ రాష్ట్రంలోని బిల్డ‌ర్లు ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ తీసుకోవాలంటే ఇక నుంచి కూల్‌ రూఫింగ్ పాల‌సీని అమ‌లు చేయాల‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమ‌వారం ఆయ‌న కూల్ రూఫింగ్ పాల‌సీని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూల్ రూఫింగుకు ఖ‌ర్చెక్కువ అవుతుంద‌ని బిల్డ‌ర్లు ఆలోచిస్తున్నార‌ని.. ఇందుకోసం చ‌ద‌ర‌పు మీట‌ర్‌కు రూ.300 ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం గోడ‌ల‌ను చ‌ల్ల‌గా ఉంచే టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింద‌న్నారు.

2030 నాటికి 300 చ‌దర‌పు కిలోమీట‌ర్ల ఏరియాలో కూల్ రూఫింగ్ పాల‌సీని అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించామ‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వం కట్టే డబుల్ బెడ్రూం ఇండ్లు, సైక్లింగ్ ట్రాక్ లు, పేవ్ మెంట్లకు కూల్ పెయింట్స్ చేయాల్సిన బాధ్యత ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. హైదరాబాద్ లో 500 ఎలక్ట్రిక్ ఆర్టీసి బస్సులు తెస్తున్నామ‌ని చెప్పారు. నిర్మాణ రంగం హైద‌రాబాద్‌లో దూసుకుపోతుంద‌ని.. ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌ల‌తో బెంగ‌ళూరును తెలంగాణ దాటేసింద‌న్నారు. కూల్ రూఫ్ పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమం అని.. దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి ఓట్లు సీట్లు రావ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

* ఇప్పటికైతే మిడిల్ క్లాస్ కు కొంత మినహాయింపు ఇస్తున్నామ‌ని.. 600 గజాల లోపు చేసే నిర్మాణాలకు మినహాయింపు ఉంటుంద‌న్నారు. ఇది వ‌ర‌కే కట్టిన బిల్డింగులకు రెట్రో ఫిట్టింగ్ ఎలా చేయాలో జీహెచ్ ఎంసీ, మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించాల‌న్నారు. సీపీఆర్‌పై ప్ర‌తి అపార్టుమెంట్‌లో అవగాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. మన నగరం కార్యక్రమం త్వరలో స్టార్ట్ చేస్తున్నామ‌ని చెప్పారు. కన్స్ ట్రక్షన్ డెమాలిష్ ప్లాంట్లను బిల్డర్లు వినియోగించుకోవాలని.. కూల్ రూఫింగ్ కు వాటిని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇంకో ఆరు సీ ఎన్ డీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

* వాస్తు అంటే కొందరు మూఢ నమ్మకం అనుకుంటార‌ని.. కానీ, కేసీఆర్ వాస్తును నమ్ముతారని తెలిపారు. వాస్తు కాన్సెప్ట్ లో సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. బిల్డింగ్ ప్లానింగ్ స్టేజీలోనే ప్లాన్ చేసుకుంటే కూల్ రూఫింగ్ తో ఖర్చు ఒకటి రెండు శాతానికి మించి పెరుగదని సూచించారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు మన స్కీం లు కాపీ కొట్టినట్టే.. మనం దీనిలో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయితే.. రేపు దేశం మొత్తం అమలు చేయాలని అడగొచ్చ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

This website uses cookies.