poulomi avante poulomi avante

పాల‌మూరు పొలాల‌కు క్రేజ్

  • రోడ్డు మార్గం మెరుగు కావ‌డ‌మే కార‌ణం
  • విద్యుత్తు కోత‌ల్లేవు.. ఇంట‌ర్నెట్ ఉంది!
  • 100 కిలోమీట‌ర్ల దాకా పొలాల‌కు గిరాకీ
  • ఐటీ నిపుణులు, ప్ర‌వాసుల ఆస‌క్తి
  • ఎక‌రం క‌నీస ధ‌ర‌.. రూ.26 లక్ష‌లు

వీకెండ్ విల్లాస్‌… వారాంత‌పు గృహాలు.. ఫామ్ హౌజులు..

కొవిడ్ పుణ్య‌మా అంటూ వీటికి గిరాకీ ఎక్కువ పెరిగింది. తెలంగాణ‌లో విద్యుత్తు కోత‌లూ లేక‌పోవ‌డం.. ఎక్క‌డైనా బ్రాడ్‌బ్యాండ్ సేవ‌లు ల‌భించ‌డంతో.. హైద‌రాబాద్ నుంచి ఓ వంద కిలోమీట‌ర్లు దూరం వెళ్లి అయినా భూముల్ని కొనుక్కుని ఫామ్ హౌజులు క‌ట్టుకోవాల‌ని చాలామంది భావిస్తున్నారు. న్యాయ‌ప‌రంగా ఎలాంటి వివాదాల్లేని భూముల్ని కొనుక్కోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా వంటివి వ‌ర్తించ‌డంతో పాటు కొత్త పాస్ పుస్త‌కాలున్న భూముల వైపు దృష్టి సారించేవారి సంఖ్య పెరుగుతోంది. మ‌రి, ఇలాంటి వారి కోసం శంషాబాద్ నుంచి నాలుగు వ‌రుస‌ల బెంగ‌ళూరు హైవే మీదుగా ఓ వంద కిలోమీట‌ర్ల వ‌ర‌కూ వెళ్ల‌గ‌లిగితే.. మంచి భూములు ల‌భిస్తున్నాయి. మ‌రి, ఏయే ప్రాంతాల్లో ఎంతెంత పొలం అమ్మ‌కానికి ఉంది? వాటి ధ‌ర‌లెలా ఉన్నాయో.. రియ‌ల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం మీకోసం..

ఐటీ నిపుణులైనా.. ప్ర‌వాస భార‌తీయులైనా.. క్లియ‌ర్ టైటిల్ ఉన్న భూములు కావాల‌ని కోరుకుంటున్నార‌ని రియ‌ల్ ఎస్టేట్ గురు స‌ర్వేలో తేలింది. అవ‌న్నీ జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో ఉంటే మ‌రింత మెరుగ‌ని అనుకుంటున్నారు. ప్ర‌ధానంగా, ఆయా పొలాల వ‌ద్ద‌కు కార్లు, ఇత‌ర వాహ‌నాలు సుల‌భంగా వెళ్ల‌గ‌లిగేలా ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఇక‌, ప్ర‌తిపాదిత రీజిన‌ల్ రింగ్ రోడ్డుకి చేరువ‌లో భూములుంటే తిరుగే లేద‌ని భావిస్తున్నారు. ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలోని 12 మండలాలతో కలిపి ముడా (మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేశారు. ముడా ఏర్పాటు వల్ల కూడా భూముల ధరలకు రెక్క‌లొచ్చాయి.

ఇప్పటికే శంషాబాద్ నుంచి కొత్తూరు, షాద్ నగర్ వరకు విల్లాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్, నవాబ్ పేట, జడ్చర్ల, భూత్పూర్ మండలాలకు సైతం ఈ సంస్కృతి పెరిగింది. జడ్చర్ల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 67 కి.మీ దూరంలో ఉంది. ఇక బాలానగర్ 46 కి.మీ, రాజాపూర్ 57కి.మీ, భూత్పూర్ 79 కి.మీ, మున్ననూరు టోల్ ప్లాజా (వయా తలకొండపల్లి) 78 కి.మీ దూరంలో ఉన్నాయి.

మహబూబ్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. దివిటిపల్లి, గొల్లపల్లి, రాజాపూర్, బాలానగర్ లో లోకల్ రైళ్ల‌కు హాల్ట్ ఉంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుత్తీక‌ర‌ణ పూర్తయింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమా వరకు ఎంఎంటీఎస్ రైళ్లను ఉందానగర్ (శంషాబాద్) దాకా అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఎంఎంటీఎస్ రైళ్లను, మరిన్ని లోకల్ రైళ్లను, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లను మహబూబ్ నగర్ వరకు భారీగా పెంచనున్నారు. దీంతో మహబూబ్ నగర్, జడ్చర్ల నుంచి కాచిగూడకు రైల్వే ప్రయాణ సమయం త‌గ్గే అవ‌కాశ‌ముంది. ఇప్పటి దాకా మహబూబ్ న‌గర్ నుంచి కాచిగూడ చేరుకోవ‌డానికి రెండు గంటల సమయం పడుతుండగా… డబ్లింగ్, విద్యుత్తీకరణ తర్వాత సుమారు 1.10 గంటలు అవుతుంది. ఇక జడ్చర్ల నుంచి కాచిగూడకు కేవలం గంటలో చేరుకోవ‌చ్చు.
మహబూబ్ నగర్ సమీపంలోనూ ఉడాన్ పథకంలో భాగంగా కేంద్రం విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేసింది. బళ్లారి నుంచి రాయచూరు, మక్తల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, కల్వకుర్తి మీదుగా కోదాడ వరకు 4 లేన్ల హైవే పనులు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు కోస్గి, కొడంగల్, తాండూరు, వికారాబాద్ మీదుగా హైవే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పాల‌మూరు నుంచి భూత్పూరు, నాగర్ కర్నూలు, అచ్చంపేట మీదుగా అమ్రాబాద్ వరకు మరో హైవే మంజూరు కానుంది. రవాణ సదుపాయాల పరంగా చూస్తే రోడ్, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ అత్భుతంగా ఉంది.

ధరలిలా ఉన్నాయి..

ప్రతిపాదిత భూములకు సమీపంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ భారీ రిజర్వాయర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి వల్ల భూగర్భ జలాలు భారీగా పెరుగుతాయి. నీటి కొరత ఉండదు. మరోవైపు ఈ రిజర్వాయర్లు రెండూ ఎన్.హెచ్-44 కు సమీపంలోనే ఉండటం వల్ల అక్కడ పర్యాటక సొబగులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. ప్ర‌స్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపునకు వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారి వెంట ప్ర‌స్తుతం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైవే పక్కనే ఎకరం రూ. 2 నుంచి రూ. 6 కోట్ల వరకు పలుకుతోంది. బాలానగర్ మండల కేంద్రం (ఎన్.హెచ్. 44) నుంచి 12 కి.మీ దూరంలో మోదంపల్లి వద్ద బీటీ రోడ్డు పక్కనే శంషాబాద్ కు కేవలం 60 కి.మీ దూరంలో ఎక‌రాల్లో పొలం ల‌భిస్తోంది. ఎకరా రూ. 65 లక్షలు చెబుతున్నారు.

బాలానగర్ మండల కేంద్రం (ఎన్.హెచ్. 44) నుంచి 9 కి.మీ దూరంలో రంగారెడ్డిగూడ బీటీ రోడ్డు పక్కనే శంషాబాద్ కు కేవలం 57 కి.మీ దూరంలో భూమి ల‌భిస్తోంది. ఇక్క‌డ ఎకరా రూ. 55 లక్షల దాకా అంటున్నారు.
జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే మార్గంలో ఎన్.హెచ్ 165 టోల్ గేట్ నుంచి కేవలం 4 కి.మీ దూరంలో రాణీపేట- అయ్యవారిపల్లి మార్గంలో 26 ఎకరాల పొలం ఉంది. 4 బోర్లు, ఒక షెడ్, చుట్టూ ఫినిషింగ్ తో ఉంది. ఎకరా రూ. 45 లక్షలు చెబుతున్నారు. ఇది శంషాబాద్ నుంచి 85 కి.మీ దూరం ఉంటుంది.
జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే మార్గంలో ఎన్.హెచ్ 165 టోల్ గేట్ నుంచి కేవలం 4 కి.మీ దూరంలో రాణీపేట- అయ్యవారిపల్లి మార్గంలో ఎకరాల పొలం ఉంది. 4 బోర్లు, ఒక షెడ్, చుట్టూ ఫినిషింగ్ తో ఉంది. ఎకరా రూ. 42 లక్షలు చెబుతున్నారు. 10 నుంచి 25 ఎక‌రాల పొల‌మూ ఇక్క‌డ ల‌భిస్తుంది. ఈ ప్రాంతం శంషాబాద్ నుంచి 85 కి.మీ దూరం ఉంటుంది.
రాజాపూర్ మండల కేంద్రం (ఎన్.హెచ్-44) నుంచి ఎడమ వైపునకు కేవలం 4 కి.మీ దూరంలో యాభై ఎకరాలు కావాల‌న్నా దొర‌కుతుంది. ఇక్క‌డ ధ‌ర దాదాపు రూ. 45 నుంచి 50 ల‌క్ష‌లు చెబుతున్నారు. ఇది శంషాబాద్ నుంచి కేవలం 57 కి.మీ దూరంలో ఉంది. బాలానగర్ మండల కేంద్రం (ఎన్.హెచ్. 44) నుంచి 10 కి.మీ దూరంలో రాఘవాపూర్ గ్రామం సమీపంలో ఎకరాల్లో పొలం ల‌భిస్తుంది. దీని ధ‌ర‌ ఎకరానికి రూ. 68 నుంచి 70 లక్షలు చెబుతున్నారు. ఇక్క‌డ్నుంచి శంషాబాద్ 58 కిలోమీట‌ర్లు.
భూత్పూర్ మండల కేంద్రం (ఎన్.హెచ్-44) నుంచి 13-15 కిలోమీట‌ర్ల దూరంలో మద్దిగట్ల వంటి గ్రామాల వ‌ద్ద ప‌ది నుంచి పాతిక ఎక‌రాలు కావాల‌న్నా దొరుకుతుంది. ఇక్క‌డ ధ‌ర సుమారు రూ.26 నుంచి 30 ల‌క్ష‌లు చెబుతున్నారు. భూత్పూర్ మండల కేంద్రం (ఎన్.హెచ్-44) నుంచి 15 కి.మీ దూరంలో కరివెన రిజర్వాయర్ దిగువన శంషాబాద్ కు 91 కి.మీ దూరంలో ఎక‌రాల్లో భూమి దొరుకుతోంది. ఇక్క‌డ ఎక‌రా ధ‌ర రూ.26 ల‌క్షల్నుంచి ల‌భిస్తుంది. రాజాపూర్ మండల కేంద్రం (ఎన్.హెచ్-44) నుంచి కేవలం 10 కి.మీ దూరంలో ప‌ది నుంచి పాతిక ఎక‌రాలైనా ల‌భిస్తుంది. ఎకరా ఎంత‌లేద‌న్నా రూ. 50 లక్షల దాకా చెబుతున్నారు. ఈ ప్రాంతం శంషాబాద్ నుంచి 64 కి.మీ దూరంలో ఉంది. అంటే ఓ గంట సేప‌టిలో శంషాబాద్ కి చేరుకోవ‌చ్చ‌న్న‌మాట‌.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles