poulomi avante poulomi avante

స్తంభించిన తెలంగాణ నిర్మాణ రంగం!

  • బంద్‌లో పాల్గొన్న 2000 మంది బిల్డ‌ర్లు
  • కార్మికులు, స్టాఫ్ క‌లిసి 3.25 ల‌క్ష‌ల మంది
  • స్వ‌చ్ఛందంగా ప‌నుల్ని నిలిపేసిన డెవ‌ల‌ప‌ర్లు

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: తెలంగాణ నిర్మాణ రంగం సోమ‌వారం బంద్ అయ్యింది. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో నిర్మాణ సంస్థ‌ల‌న్నీ నిర్మాణ ప‌నుల్ని నిలిపివేశాయి. క్రెడాయ్ హైద‌రాబాద్‌, క్రెడాయ్ తెలంగాణ‌, ట్రెడా, టీబీఎఫ్‌, టీడీఏ వంటి నిర్మాణ సంఘాల లెక్క‌ల ప్ర‌కారం.. రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు ఈ బంద్‌లో పాల్గొన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 1200 మంది బిల్డ‌ర్లు పాల్గొన‌గా.. ఇత‌ర ప‌ట్ట‌ణాల‌కు చెందినవారు దాదాపు ఎనిమిది వంద‌ల మంది దాకా ఉంటారు. సైట్ల‌లో ప‌ని చేసేవారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది కార్మికులు ప‌నుల్ని నిలిపివేశారు. ప‌రోక్షంగా యాభై వేల మంది, ఆఫీసు స్టాఫ్ 25000 మంది.. మొత్తం క‌లిపితే సుమారు 3.25 ల‌క్ష‌ల మంది ఈ బంద్‌లో పాల్గొని త‌మ సంపూర్ణ మ‌ద్ధ‌తును ప్ర‌క‌టించారు.

గత కొంతకాలం నుంచి పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరల్ని చూస్తుంటే నిర్మాణ రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ సంద‌ర్భంగా క్రెడాయ్ హైద‌రాబాద్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. క‌ష్టకాలంలో ఉన్న నిర్మాణ రంగాన్ని ప్ర‌భుత్వాలు ఆదుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. పెరుగుతున్న నిర్మాణ సామ‌గ్రి ధ‌ర‌ల్ని చూస్తుంటే నిర్మాణ రంగం నివ్వెర‌పోతోంద‌ని.. కృత్రిమంగా పెంచుతున్న ధ‌ర‌ల్ని నియంత్రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌న్నారు. తాము ఎవ్వ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని. కాక‌పోతే, త‌మ‌ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం అర్థం చేసుకుని.. సానుకూలంగా స్పందించి ప‌రిష్క‌రించాల‌న్న‌దే త‌మ‌ కోరిక అని.. అందుకే స్వ‌చ్ఛందంగా ఈ రోజు బంద్ చేస్తున్నామ‌’ని వివరించారు.

‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్టీలు మీద విధించే ఏడున్నర శాతం దిగుమతి సుంకంతో పాటు స్టీలు మరియు ఇతర భవన నిర్మాణ సామగ్రిపై జీఎస్టీని తొలగించాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు తెలిపారు. భారత నిర్మాణ రంగానికి మౌలిక సదుపాయాల హోదాను మంజూరు చేయాలని కేంద్రాన్ని కొన్నేళ్ల నుంచి కోరుతున్నామని.. కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల‌ని తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు సీహెచ్ ప్ర‌భాక‌ర్ రావు డిమాండ్ చేశారు. సోమ‌వారం నాడు రాష్ట్ర‌వ్యాప్తంగా త‌ల‌పెట్టిన నిర్మాణ రంగం బంద్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యింద‌ని.. డెవ‌ల‌ప‌ర్లు స్వ‌చ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నార‌ని ట్రెడా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మేకా విజ‌య్ సాయి తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న త‌మ నిర్మాణ సంఘాల‌న్నీ బంద్‌లో పాల్గొన్నాయ‌ని.. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాల‌ని క్రెడాయ్ తెలంగాణ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఇంద్ర‌సేనారెడ్డి తెలిపారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles