Categories: TOP STORIES

ఈసారి అబుదాబీలో.. క్రెడాయ్ నాట్ కాన్ 2022

  • నవంబరు 11 నుంచి 13 దాకా
  • యాస్ ఐల్యాండ్, అబుదాబీ
  • హాజరవుతున్న 1200కి పైగా డెవలపర్లు..
  • 1300+ డెలిగేట్లు హాజరు

భారతదేశంలోని నిర్మాణ రంగానికి దిక్సూచీగా వ్యవహరిస్తోన్న క్రెడాయ్ నేషనల్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత.. న్యాట్ కాన్ 2022ను ఈసారి అబుదాబిలోని యాస్ ఐల్యాండ్లో నిర్వహిస్తోంది. భారత నిర్మాణ రంగానికి చెందిన దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 11న జరిగే ఆరంభోత్సవ కార్యక్రమంలో యూఏఈలో భారత అంబాసిడర్ సంజయ్ సుధీర్ పాల్గొంటారు. విజనరి కార్పొరేట్ లీడర్ జర్నీకి సంబంధించి లూలు గ్రూప్ ఛైర్మన్, ఎండీ యూసుఫ్ అలీ తన అనుభవాల్ని పంచుకుంటారు.

యూఏఈలో భారతీయుల రియల్ ఎస్టేట్ రంగం ప్రయాణం గురించి శోభా డెవలపర్స్ ఫౌండర్, ఛైర్మన్ పీఎన్సీ మీనన్ వివరిస్తారు. క్రీడలు మరియు వ్యాపార ఈకో సిస్టమ్ గురించి ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తెలియజేస్తారు. నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై భారత నిర్మాణ రంగానికి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తారు. నివాస మరియు వాణిజ్య సముదాయాల్లో సుస్థిరత, డేటాసెంటర్లు, వేర్ హౌసింగ్, ద్వితీయశ్రేణీ పట్టణాల్లో నగరీకరణ, ఆఫ్ షోర్ ఫండ్ రైజింగ్ వంటి అంశాలపై నిపుణులతో ప్రత్యేక చర్చలుంటాయి.

భారతదేశంలో సుమారు 21 రాష్ట్రాల్లోని 217 ఛాప్టర్లకు చెందిన పదమూడు వేలకు పైగా డెవలపర్లు క్రెడాయ్ నేషనల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ నిర్మాణ రంగానికి చెందిన తాజా పోకడలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి ఎప్పటికప్పుడు తమ సభ్యులకు అందించేందుకు క్రెడాయ్ పాటుపడుతుంది. ప్రస్తుతం క్రెడాయ్ నేషనల్ అధ్యక్షుడిగా హర్షవర్దన్ పటోడియా, ఛైర్మన్ గా సతీష్ మగర్ తదితరులు వ్యవహరిస్తున్నారు.

This website uses cookies.