భారతదేశంతో యూఏఈకి ఐదు దశాబ్దాల నుంచి శక్తిమంతమైన సంబంధాలు కలిగి ఉన్నాయని యూఏఈ కి చెందిన మిరాల్ గ్రూప్ సీఈవో మహమ్మద్ అబ్దాలీలా అల్ జబీ అన్నారు. అబూ దాబిలోని యాస్ ఐలాండ్ లోని హిల్టన్ హోటల్లో శుక్రవారం ఆరంభమైన క్రెడాయ్ నాట్ కాన్- 2022 అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సుమారు వంద బిలియన్ డాల్లర మేరకు వాణిజ్య ఒప్పందాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. క్రెడాయ్ నాట్ కాన్- 2022 నిర్వహించడానికి అబు దాబిని ఎంచుకున్నందుకు గౌరవంగా ఉందన్నారు.
ఆర్థికంగా వైవిధ్యమైన అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేస్తూ.. విశ్రాంతి, వినోద రంగాల మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. అభివృద్ధి కి సంబంధించి 360 డిగ్రీలు ఆలోచించి సహేతుకమైన నిర్ణయాల్ని తీసుకుంటామని వివరించారు. క్రెడాయ్ వంటి సరైన భాగస్వాములతో పని చేసినప్పుడే తమ విజయం ఆధార పడుతుందని అన్నారు. ఫెరారీ, వార్నర్ బ్రదర్స్ వంటి గ్లోబల్ సంస్థలు తమ దేశంలోకి విచ్చేశాయని.. ఇలాంటి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని తమ దేశం ఆకర్షిస్తోందని తెలిపారు. సుమారు 30 లక్షల మంది భారతీయులు తమ దేశంలో పని చేస్తున్నారు తెలిపారు.
“ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల డెవలపర్‌లకు కనీసం రూ. 5,000 కోట్ల నుండి రూ. 10,000 కోట్ల వరకు కేటాయించడం గురించి హెచ్‌డిఎఫ్‌సి క్యాపిటల్‌తో మాట్లాడుతున్నామ”ని క్రెడాయ్ ప్రెసిడెంట్ హర్ష్ వర్ధన్ పటోడియా తెలిపారు. క్రెడాయ్ ఛైర్మన్ సతీష్ మగర్ మాట్లాడుతు.. మూడేళ్ళ విరామం తర్వాత నాట్ కాన్- 2022 అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. “భారతదేశం ఒక స్టార్టప్ హబ్ మరియు కొత్త-యుగం స్టార్టప్లు వాస్తవ ప్రపంచ సమస్యలకు, వేగంగా మరియు ప్రభావవంతంగా పరిష్కారాలను కనుగొంటున్నాయని క్రెడాయ్ ప్రెసిడెంట్-ఎలెక్ట్ బొమన్ ఇరానీ అన్నారు.
This website uses cookies.