Telangana Building Permissions Speedy Approval
టీజి బీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిశోర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. లేఅవుట్, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులో అనుమతులు ఇచ్చే టీజి బీపాస్ దరఖాస్తుల పరిష్కార పురోగతి పై సచివాలయంలో ఇటీవల ప్లానింగ్ అధికారులతో ముఖ్య కార్యదర్శి సమీక్షించారు.
టీజి బీపాస్ దరఖాస్తుల డిస్పోజల్ వేగంగా చేపట్టాలన్నారు. దరఖాస్తు తో జత చేయాల్సిన ఏవైనా డాక్యుమెంట్ లు తక్కువగా ఉంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేస్తూ తిరిగి అన్ని డాక్యుమెంట్ లతో దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా టీఎస్ బీపాస్ కింద హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు ఇచ్చిన అనుమతులపై నివేదిక ఇవ్వాలన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం టీజి బీపాస్ దరఖాస్తుల పరిష్కార ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీటీసీవో దేవేందర్ రెడ్డి, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ లు విద్యాధర్, రాజేంద్ర ప్రసాద్ నాయక్, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ సిటీ ప్లానర్ లు తదితరులు పాల్గొన్నారు.
This website uses cookies.