Categories: TOP STORIES

అనుమ‌తులు ఆల‌స్యం.. హెచ్ఎండిఎ అధికారులకు జ‌రిమానా

* టీఎస్ బిపాస్ ఫైళ్ల పెండింగ్ ఫలితం
* ఆదేశాలు జారీ చేసిన హెచ్ఎండీఏ కమిషనర్ అర్విoద్ కుమార్

(రెజ్ న్యూస్‌, హైదరాబాద్) : ఉద్యోగ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ సోమవారం జ‌రిమానా విధించారు. టీఎస్ బిపాస్ చట్టానికి లోబడి ఫైళ్లను నిర్దేశించిన గడువు లోగా పరిష్కారించడంలో జాప్యం చేసిన నలుగురు అధికారుల కు వెయ్యి రూపాయల(రూ.10,000లు) చొప్పున నలుగురికి మెట్రోపాలిటన్ కమిషనర్ పెనాల్టీ విధించారు. వీరిలో హెచ్ఎండిఏలో పనిచేస్తున్న ముగ్గురు అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్లు (ఏపిఓ) సుధీర్ కుమార్, రమేష్ చరణ్, వసుంధర లతో పాటు తహసిల్దార్ గజఫర్ హుస్సేన్ ఉన్నారు. వీరి వద్ద 16 రోజుల నుంచి 27 రోజుల వరకు ఫైలు పెండింగ్ లో ఉన్నట్టు కమిషనర్ గుర్తించారు. దీనిపై విచారించి ఇలాంటి పరిస్థితులు హెచ్ఎండిఏలో పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో మొదటిసారిగా నామమాత్రపు పెనాల్టీ వేయించారు.

పురపాలక శాఖ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి నిర్దిష్టమైన గడువులోగా అనుమతులు మంజూరు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ బిపాస్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీఎస్ బిపాస్ చట్టం ద్వారా ప్రజలకు నిర్మాణదారులకు, డెవలపర్లకు అనతి కాలంలో బిల్డింగ్ పర్మిషన్ అనుమతులు లభిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంతో సమర్థవంతంగా అమల‌వుతు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

This website uses cookies.