Categories: TOP STORIES

డబుల్ బెడ్రూం ఇళ్లకు డిమాండ్

2 బీహెచ్‌కే ఇళ్లకు సై

50 లక్షల నుంచి కోటి ఇళ్లు కావాలి

భారత్ లో డబుల్ బెడ్రూం ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ ఫామ్ హౌసింగ్.కామ్ తాజాగా ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్‌లైన్ సెర్చ్-ఐరిస్ ఇండెక్స్‌ సర్వేలో ఈ విషయం తేలింది. ఆగస్టు ఐరిస్ ఇండెక్స్ నివేదిక గమనిస్తే.. ఆన్‌లైన్ ప్రాపర్టీ సెర్చ్ యాక్టివిటీలో నెలవారీగా 10 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. ఇదే సమయంలో ఇండెక్స్‌ 99 పాయింట్లకు చేరింది. డిసెంబర్ 2023 తర్వాత ఇది అత్యధికం కావడం గమనించాల్సిన‌ విషయమని హౌసింగ్ డాట్‌కామ్ చెబుతోంది.

హౌసింగ్ డాట్‌కామ్ తాజా 2024 ఐరిస్ ఇండెక్స్ రిపోర్ట్ భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అనేక కీలక అంశాలను, ట్రెండ్స్‌ను హైలైట్ చేస్తోంది. ఆన్‌లైన్ ప్రాపర్టీ సెర్చ్‌లలో ఢిల్లీ-ఎన్.సి.ఆర్ ముందుంది. రూ.50 లక్షల నుండి రూ.2 కోట్ల మధ్య ధర కలిగిన ప్రాపర్టీలకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ముంబై ప్రాపర్టీ మార్కెట్‌లో మాత్రం రూ.50 లక్షల నుండి రూ. 1 కోటి ధర పరిధిలో అధిక డిమాండ్‌ కనిపిస్తోంది. ఈ క్రమంలో డబుల్ బెడ్రూం అపార్ట్‌మెంట్‌ల వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 37 శాతం మంది 2 బీహెచ్‌కే కోసం సెర్చ్ చేశారు. దీంతో ఈ కేటగిరి అగ్ర స్థానంలో ఉంది. తర్వాత 32 శాతంతో 3 బీహెచ్‌కే కేటగిరి నిలిచింది. గృహ‌ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల‌ను 50 శాతం మంది వెతుకుతున్నారు.

This website uses cookies.