హైదరాబాద్‌కి చెందిన పౌలోమి ఎస్టేట్స్ బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తర బెంగళూరులోని తనిసంధ్రలో గల.. మాన్యత ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ఫేజ్ 2లో.. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త ప్రాజెక్టును నిర్మిస్తోంది. సుమారు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 35 అంతస్తుల విలాసవంతమైన కట్టడాల్ని కడుతోంది. మొత్తం పద్దెనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టును రెండు ఫేజుల్లో కట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. ఫేజ్ వన్‌లోని రెండు టవర్లకు సంబంధించిన నిర్మాణ పనుల్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తుంది. ఇందులో మొత్తం 850 ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఫ్లాట్ల విస్తీర్ణం సుమారు 1450 నుంచి 2550 చదరపు అడుగుల్లో ఉంటాయి.
ప్రధాన ఐటీ హబ్‌లు మరియు విద్యాసంస్థలకు సమీపంలో ఉండటం మరియు నగరంలోని ఇతర ప్రాంతాలకు అద్భుతమైన కనెక్టివిటీ కారణంగా.. తనిసంద్ర రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో పెరుగుదలను చూసింది. బెంగుళూరులోని పౌలోమి యొక్క మొదటి ప్రాజెక్ట్ నగరంలో పట్టణ జీవనాన్ని పునర్ నిర్వచిస్తుందని చెప్పొచ్చు. ఇది ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్‌లతో కూడిన ప్రీమియం అపార్ట్‌మెంట్‌లు, రూఫ్‌టాప్ ఇన్ఫినిటీ పూల్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ మరియు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సెంటర్‌తో సహా అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుందని పౌలోమీ సంస్థ చెబుతోంది.
This website uses cookies.