Categories: LATEST UPDATES

బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్

  • పెరుగుతున్న మెట్రో కనెక్టివిటీతో అద్దెల్లో పెరుగుదల

బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ పెరగనుంది. బైయప్పనహళ్లి-వైట్ ఫీల్డ్ మెట్రో ప్రాజెక్టు ఈ ఏడాది మధ్య నాటికి పూర్తిగా పని చేసే అవకాశం ఉండటంతో వైట్ ఫీల్డ్ లోని ఆఫీస్ అద్దెలు రాబోయే రెండేళ్లలో 8 శాతం నుంచి 10 శాతం మేర పెరగనున్నాయని కొలియర్స్ తాజా నివేదిక వెల్లడించింది. అద్దెల్లో పెరుగుదల అనేది డిమాండ్ తోపాటు స్థూల ఆర్థిక కారకాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

బెంగళూరులో రెండో అతిపెద్ద కార్యాలయ మార్కెట్ గా ఉన్న వైట్ ఫీల్డ్ లో దాదాపు 40.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్టాక్ కలిగి ఉంది. గతనెలలో వైట్ ఫీల్డ్ వైపు మెట్రో లైను పాక్షికంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రాంతానికి బెంగళూరులోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ బాగా పెరిగింది. దీంతో ఇక్కడి ఆఫీస్ స్థలాలకు డిమాండ్ రానుందని అంచనా. 2011-16తో పోలిస్తే మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైనందున 2017-22లో వైట్ ఫీల్డ్ లో ఆఫీసు స్థలాల సగటు వార్షిక సరఫరా 10 శాతం మేర పెరిగింది. అలాగే లీజింగ్ లో 18 శాతం మేర పెరుగుదల కనిపించింది.

This website uses cookies.