Nampally ACB Court gave Bail to Balakrishna
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్టుతో హైదరాబాద్ నిర్మాణ రంగానికి చెందిన కొందరు బిల్డర్లు, రియల్టర్లు ఒక్కసారిగా షాకయ్యారు. బాలకృష్ణను సంప్రదిస్తే అనుమతి త్వరగా వస్తుందనే పేరు బిల్డర్లలో ఎక్కువగా ఉంది. నిబంధనల పేరిట వేధించకుండా డెవలపర్లకు అనుమతినిస్తారనే పేరుంది. కాకపోతే, ఏదైనా ప్రాజెక్టుకు అనుమతినిస్తే.. కాసుల కోసం పెద్దగా వేధించేరకం కాదని పలువురు బిల్డర్లు అంటుంటారు. అందుకే, అధిక శాతం మంది ఆయన్ని ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి.. కొందరు డెవలపర్లు ఖరీదైన వస్తువులను బహుమతిగా ఇచ్చేవారని చెప్పుకుంటారు. ఖరీదైన వాచీలు, యాపిల్ ఫోన్లు, ల్యాప్‌టాపులు వంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
This website uses cookies.