హైదరాబాద్లో ఓ విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో.. మేఘాల్ని తాకేలా దర్శనమిచ్చే ఆకాశహర్మ్యాలతో.. అత్యద్భుతంగా డెవలప్ అవ్వడానికి పూర్తి అవకాశమున్న ప్రాంతం.. కోకాపేట్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. కోకాపేట్ సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా.. నియోపోలిస్‌కు వెళ్లే మార్గం.. నియోపోలిస్ హిల్ ఏరియాలో ఈ ఆకాశహర్మ్యాలు ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ పూర్తయ్యి.. ఒక ఫ్యూచరిస్టిక్ లొకేషన్‌గా అవతరించడానికి ఎంతలేదన్నా మరో నాలుగైదేళ్లయినా పట్టే అవకాశముంది. ఇలాంటి అంశాలన్నీ అర్థం చేసుకున్న హోమ్ బయ్యర్లతో పాటు రియల్ ఇన్వెస్టర్లు.. కోకాపేట్‌లో ఆకాశహర్య్మాల్ని కొనేందుకు ముందుకొస్తున్నారు. మరి, వీరి కోసం కోకాపేట్‌లో ఏయే ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయో తెలుసా?
కోకాపేట్ నియోపోలిస్‌లో రాజపుష్ప ప్రాపర్టీస్ కాసా లగ్జూరా అనే ఆకాశహర్మ్యాన్ని 7.7 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇందులో వచ్చేవి 5 టవర్లు కాగా 612 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవన్నీ ఫోర్ బీహెచ్‌కే అల్ట్రా లగ్జరీ అపార్టుమెంట్లే కావడం గమనార్హం. విస్తీర్ణం విషయానికొస్తే.. 5735 నుంచి 7790 చదరపు అడుగుల్లో డిజైన్ చేశారు. ధర విషయానికొస్తే.. చదరపు అడుక్కీ రూ.12,999 ప్లస్ అడిషినల్స్ చెబుతున్నారు.
బెంగళూరుకు చెందిన సాలార్‌పూరియా సంస్థ సత్వా లేక్‌రిడ్జ్ అనే ప్రాజెక్టును 6.3 ఎకరాల్లో ఆరంభించింది. మొత్తం ఆరు టవర్లలో వచ్చవి 599 ఫ్లాట్లు కాగా.. త్రీ, ఫోర్ మరియు ఫైవ్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను డిజైన్ చేసింది. ఫ్లాట్ల విస్తీర్ణం 2152 నుంచి 5472 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టను ఆరంభించిన తొలి రోజుల్లోనే హాట్‌కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ధర విషయానికి వస్తే.. సంస్థను సంప్రదించాలి.
హైదరాబాద్ నగరానికి చెందిన డీఎస్ఆర్ సంస్థ డీఎస్ఆర్ వాలర్ అనే ప్రాజెక్టును మూడు ఎకరాల్లో ప్రారంభించింది. ఇందులో వచ్చేవి రెండు టవర్లు కాగా అందులో 283 ఫ్లాట్లు వస్తాయి. అన్నీ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లే. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికి వస్తే.. 3240 నుంచి 4090 చదరపు అడుగుల్లో డిజైన్ చేశారు. ధర చదరపు అడుక్కీ పదకొండు వేలు ప్లస్ అడిషనల్స్ చెబుతున్నారు. ఇదే ఫైనల్ రేటు కాదు. మీరొకసారి సంస్థను సంప్రదిస్తే ఫ్లాట్ల లభ్యత, తుది ధర తెలిసే అవకాశముంది.
రాంకీ సంస్థ రాంకీ వన్ ఒడిస్సీ అనే ప్రాజెక్టును 5.3 ఎకరాల్లో డిజైన్ చేసింది. ఇందులో మూడు టవర్లలో 783 ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఇందులో త్రీ, త్రీ పాయింట్ ఫైవ్, ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ల విస్తీర్ణం 1750 నుంచి 3020 చదరపు అడుగుల్లో కడుతున్నారు. త్రీ బేస్‌మెంట్స్, స్టిల్ట్ ప్లస్ 36 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో తుది ధర కోసం సంస్థను సంప్రదించండి.
సాస్ ఇన్‌ఫ్రా అనే సంస్థ కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే సాస్ క్రౌన్ అనే 58 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని డిజైన్ చేసింది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును 4.48 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఐదు టవర్లలో వచ్చేవి 250 యూనిట్లు మాత్రమే. ఇందులో ఫోర్, ఫైవ్ బీహెచ్‌కే తో పాటు డ్యూప్లే ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం 6566 నుంచి 8811 చదరపు అడుగుల్లో కడుతున్న ఈ ప్రాజెక్టులో ధర చదరపు అడుక్కీ పదమూడు వేల ఐదు వందలు చెబుతున్నారు.
హైదరాబాద్లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన పౌలోమీ ఎస్టేట్స్ ఆరంభించిన పౌలోమీ అవాంతే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ మార్చి నెలలో ప్రాజెక్టును హ్యాండోవర్ చేస్తున్నారు. 4.75 ఎకరాల్లో.. 3 టవర్లను డిజైన్ చేయగా.. ఇందులో వచ్చేవి సుమారు 477 యూనిట్లు. ప్రస్తుతం కేవలం కొన్ని త్రీ బీహెచ్‌కే ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికి వస్తే.. 1550 నుంచి 2576 చదరపు అడుగుల్లో ఉన్నాయి. ధర చదరపు అడుక్కీ 9 వేలు చెబుతున్నారు. ప్లస్ అడిషనల్స్ ఉంటాయి.
డీ బ్లూఓక్ మరియు పి మంగత్రం ప్రాపర్టీస్ సంస్థ కోకాపేట్‌లో ద ట్రిలైట్ అనే ప్రాజెక్టును 4.42 ఎకరాల్లో ఆరంభించింది. ఇందులో కనోపస్ టవర్‌ను 56 అంతస్తుల్లో, వెగా 46 అంతస్తులు, రిగెల్‌ను 49 అంతస్తుల్లో కడుతోంది. ఈ 3 టవర్లలో 462 ఫ్లాట్లన్నీ ఫోర్ బీహెచ్‌కే ఫ్లాట్లేనని గుర్తుంచుకోండి. విస్తీర్ణం విషయానికి వస్తే 3,666 నుంచి 5777 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ధర విషయానికి వస్తే చదరపు అడుక్కీ రూ.10,500 ప్లస్ అడిషనల్స్ చెబుతున్నారని తెలిసింది. ఫ్లాట్ల లభ్యత, అంతిమ ధర కోసం బిల్డర్‌ని సంప్రదిస్తే ఉత్తమం.
ఫ్రంట్‌లైన్ బిల్డర్స్ కోకాపేట్‌లోని శంకర్‌పల్లి రూటులో ఫ్రంట్‌లైన్ సెవెన్ అనే 12 అంతస్తుల ప్రాజెక్టును 6.84 ఎకరాల్లో డిజైన్ చేసింది. 6 టవర్లలో 670 యూనిట్లను నిర్మించగా.. టూ మరియు త్రీ బీహెచ్‌కే ఫ్లాట్ల విస్తీర్ణం 1330 నుంచి 2185 చదరపు అడుగుల్లో లభిస్తాయి. ధర విషయానికి వస్తే రూ.8499 నుంచి ఆరంభమవుతుందని సమాచారం. ఫ్లాట్ల లభ్యత, తుది ధర కోసం బిల్డర్‌ని సంప్రదించండి.
రాజపుష్ప ప్రాపర్టీస్ కోకాపేట్‌లో రాజపుష్ప ప్రిస్టినా అనే ప్రాజెక్టును 12.58 ఎకరాల్లో డిజైన్ చేసింది. ఆరు టవర్లలో 1782 ఫ్లాట్లను నిర్మిస్తుంది. 42 అంతస్తుల ఎత్తులో వచ్చేవి టూ, త్రీ, ఫోర్ బెడ్‌రూం ఫ్లాట్లు కాగా ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికి వస్తే 1380 నుంచి 4595 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ధర విషయానికి వస్తే.. రూ.8249 నుంచి రూ.8599గా చెబుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫ్లాట్ల ధరను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది.
నగరానికి చెందిన టాప్ డెవలపర్ అయిన పౌలోమీ ఎస్టేట్స్.. కోకాపేట్ సర్వీస్ రోడ్డును ఆనుకుని.. 55 అంతస్తుల పౌలోమీ పలాజోను ఆరంభించింది. ఇందులో ఇప్పటికే 75 శాతం దాకా ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. 2.3 ఎకరాల్లో వచ్చే టవర్‌లో వచ్చేవి సుమారు 145 ఫ్లాట్లు కాగా.. ఫ్లాట్ల విస్తీర్ణం 6225 నుంచి 8100 చదరపు అడుగుల్లో ఉంటాయి. ధర విషయానికి వస్తే చదరపు అడుక్కీ రూ.15వేలు ప్లస్ అడిషనల్స్ చెబుతున్నారు.
This website uses cookies.