poulomi avante poulomi avante

అన్నీ ఇన్నీ కావు ధరణీ స‌మ‌స్య‌లు!

* మన్నె నర్సింహా రెడ్డి
ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్

 

రాష్ట్రవ్యాప్తంగా ధరణి రాక ముందు ఎలాంటి వివాదాల్లేని లక్షలాది ఎకరాల పట్టా భూములు.. మాజీ సైనికులకు అసైన్ చేసిన భూములు.. ఒక స‌ర్వే నెంబ‌రులో కొంత‌భాగం కోర్టు కేసుంటే ఆయా పూర్తి స‌ర్వే నెంబ‌ర్ల‌ను నిషేధిత జాబితా (22-ఏ)లో చేర్చ‌డం వ‌ల్ల ల‌క్షలాది మంది రైతులు త‌మ అవ‌స‌రాల‌కు భూముల్ని అమ్ముకోలేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. నిషేధిత జాబితా నుంచి ఆయా భూముల‌ను తొల‌గించ‌డానికి నిత్యం ల‌క్షాలాది మంది రైతులు కలెక్ట‌ర్ల కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు.ధరణి వచ్చాక మరియు ఒక సర్వే నెంబరులో కొంత భాగం సీలింగ్ ఉంటే మొత్తం భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ మరియు ఒక సర్వే నెంబరులో కొంత భాగం కోర్టు కేసు ఉంటే లేదా ప్రాజెక్టులు, రోడ్లు ఇతర ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన పట్టా భూములు మాత్రమే కాకుండా పూర్తి సర్వే నెంబర్లను నిషేధిత జాబితా (22-ఏ)లో చేర్చడం వలన లక్షలాది రైతులు తమ అవసరాలకు భూములు అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నది మరియు ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి తొలగించుటకు నిత్యం లక్షలాది రైతులు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దారుణ పరిస్థితి.

ప్ర‌తిగ్రామంలో..

  • తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సుమారు వంద సర్వే నెంబర్లలో ఆర్ ఎస్ ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్) అంటే.. పూర్వకాలంలో రూపొందించిన భూమికి కీలకమైన పత్రం వంటివి అయిన‌ సేత్వార్, ఖాస్రా పహాణీ (1954-55) మరియు చెస్సాల పహణి (1956-58) లతో ప్రస్తుత ధరణి రికార్డులను పోల్చినపుడు.. ఒక సర్వే నెంబర్లో పూర్తి విస్తీర్ణంలో ఏర్పడిన ఎక్కువ, తక్కువలు పరిష్కరించకుండా.. భూ రికార్డుల ప్రక్షాళన చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం వలన వివాదాలు పెరిగాయి. వేలాది మంది రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ధరణి పోర్టల్ లో ఆర్ఎస్సార్ సరి చేయకుండా.. రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోతే.. భవిష్యత్తులో ఏర్పడే వివాదాలను నివారించేందుకు త‌క్ష‌ణం గ్రామ స‌ద‌స్సుల‌ను ఏర్పాటు చేసి ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.
    కీలకమైన భూసమస్యలను తక్కువ సమయంలో రెవెన్యూ అధికారులకు టార్గెట్ పెట్టి, కంప్యూటర్ లో నమోదు చేయుటకు నిపుణులైన ఆపరేటర్లను నియమించలేదు. పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించకుండా కేవలం ఆధార్ నెంబర్లు సేకరించి అసమగ్రంగా భూ ప్రక్షాళన నిర్వహించి.. పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం వలన.. గత పాత పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న సర్వే నెంబర్లు కనిపించకుండా పోయాయి. ధరణికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వేల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు.. మ్యుటేషన్ కాకుండా పెండింగులో ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో ఇప్పటికీ పాత పట్టాదార్ల పేర్లు ఉండి.. కొన్ని చోట్ల పట్టాదారు పాసు పుస్తకాలు పొంది రైతుబంధు పొందుతూ కొత్త పాస్ పుస్తకాలు ఉన్నందువల్ల వేరోకరికి అమ్మడం వలన వివాదాలు పెరుగుతున్నాయి

    స‌మ‌న్వ‌యం లేదు!
    రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్, హెచ్ఎండీఏ వంటి ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు సమాచార పంపకంలో లోపం వల్ల.. లేఅవుట్ అనుమతినిచ్చిన డిపార్టుమెంట్లు, ఆయా సర్వే నెంబర్లు, లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిన విస్తీర్ణం వంటి వివరాలను అధికారికంగా రెవెన్యూ శాఖకు అందించలేదు. దీంతో లక్షలాది ఎకరాలు క్షేత్ర స్థాయిలో ప్లాట్లుగా మారినా రెవెన్యూ రికార్డులలో వ్యవసాయ భూమిగా నమోదు అయి ఉండటం, ప్లాట్లుగా మారకపోవడం వలన 2017లో అసమగ్రంగా చేసిన భూ రికార్డుల ప్రక్షాళన వ‌ల్ల‌.. గ‌తంలో అమ్మిన భూయ‌జ‌మానుల‌కే మ‌ళ్లీ పాస్ పుస్త‌కాలు రావ‌డంతో.. వారు వేరొక‌రికి విక్ర‌యించ‌డంతో అనేక దారుణాలు ఏర్ప‌డుతున్నాయి. మరో పక్క ఒక సర్వే నెంబర్లో కొంత భాగం ప్లాట్లకు విక్రయిస్తే.. పూర్తి విస్తీర్ణం ప్లాట్లు లేదా నాలాగా నమోదు కావడం వలన.. వేలమంది రైతులు పాసుపుస్తకాలు పొందక కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి.

    ధరణి చట్టం తెచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత కూడా లక్షలాది రైతులకు వివిధ సాంకేతిక కారణాలతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అంద‌ట్లేదు. డివిజనల్ మేజిస్ట్రేట్ హోదా స్థాయిలో ఉన్న ఆర్డోవోల అధికారాలు తొలగించడం వలన ధరణి చట్టం తర్వాత ఇనాం భూములకు ఓఆర్‌సీలు జారీ చేయ‌డం మ‌ర్చిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారానికి నోచుకోని సాదా బైనామా దరఖాస్తులకు లెక్కే లేదు
  • ధరణిలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల‌లో లింకు డాక్యుమెంట్లు ఎంట్రీ ఆప్షన్ లేకపోవడం వలన భూ యాజమాన్య హక్కులు పొందిన విధానం పై స్పష్టత లేదు. ఒక సర్వే నెంబర్ పై ధరణి తర్వాత పూర్తి స్థాయిలో ఎన్ కంబ‌రెన్స్ స‌ర్టిఫికెట్ పొందకపోవడం, రిజిస్ట‌ర్డ్ డాక్యుమెంట్స్ సర్టిఫైడ్ కాఫీలు ధరణి ద్వారా పొందలేకపోతున్నారు. చనిపోయిన పట్టాదారు వారసులకు చేసే ఆటోమేటిక్ స‌క్సెష‌న్‌ విరాసత్/పౌతి వలన భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలేత్తే అవకాశం ఉంది. కావున విరాసత్ విషయంలో సమగ్ర విచారణ /ఆర్ఐ పంచనామా తర్వాత కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో విరాసత్ చేయాలి
  • భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్ మెంట్ రిజిస్ట‌ర్‌లు లేవనో, ఆర్ఎస్ఆర్‌ తేడాలున్నాయనో లక్షలాది వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన పేదల అసైన్డ్ భూములకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయకపోవడం వలన తీవ్ర మానసిక వేదనకు గుర‌వుతున్నారు. ధరణికి ముందు పట్టా భూములుగా ఉన్న లక్షలాది ఎకరాలు రైతులకు ఎలాంటి నోటీసు, విచారణ లేకుండా.. భూదాన్, వక్ఫ్ భూములుగా మార్చ‌డం వ‌ల్ల‌ చాలా మందికి కొత్త‌ పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదు
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles