ప్రీ లాంచ్ ఆఫర్ అనగానే ఎగబడి కొంటున్నారా..? బై బ్యాక్ ఆఫర్లు.. ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఈజీ ప్రాఫిట్స్ అంటే నమ్మేస్తున్నారా..? అయితే మీకే ఈ వార్నింగ్. ఎట్రాక్టివ్ ఆఫర్లతో లక్షలు.. కోట్ల రూపాయలు వసూలు చేయడం. సమయం రాగానే బిచాణా ఎత్తేయడం. లాస్ట్ ఫోర్- ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా బోర్డ్ తిప్పేస్తోన్న కంపెనీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ 2-3 నెలల్లో తెలంగాణ ముఖ్యంగా హైద్రాబాద్‌లో అయితే ప్రీ లాంఛింగ్ మోసాలు మరీ ఎక్కువైపోయాయ్.
బాధితుల్ని రోడ్డున పడేసిన ఆర్‌జే హోమ్స్, సువర్ణభూమితో ఆగేలా లేవు ఈ మోసాలు. మరో 10-15 కంపెనీలు తమ కస్టమర్లను నట్టేటా ముంచడానికి రెడీగా ఉన్నాయంటున్నారు. లిస్ట్‌లో ఉన్న కంపెనీలన్నీ వందల.. వేల కోట్ల రూపాయలు వసూలు చేసినవే..! మరి ఈ ప్రీ లాంఛింగ్ మోసాలకు బ్రేక్ పడేదెప్పుడు..? తప్పు ఎవరిది..? వేలం వెర్రిగా బుట్టలో పడుతోన్న జనాలదా..? కోట్లకు కుచ్చుటోపీ పెడుతోన్నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వాలవా..?
This website uses cookies.