Categories: Celebrity Homes

సెలబ్రిటీల హోమ్ ఆఫీసులు సూపర్

ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ విధానం చాలామందికి దీర్ఘకాలిక అంశంగా మారింది. అయితే, ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు ఆ వాతావరణం కూడా అందుకు అనుగుణంగా ఉండాల్సిందే. లేకుంటే ఉత్పాదకతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఓ సవాల్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం మీ ఇంట్లో ఆఫీస్ సెటప్ ఇబ్బందిగా ఉంది అని మీకు అనిపిస్తే.. దానిని మార్చే సమయం వచ్చేసింది.

మరి మీ ఇంట్లో మీ ఆఫీస్ సెటప్ ఎలా ఉండాలి? ఈ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీల కంటే ప్రేరణ ఎవరు ఉంటారు చెప్పండి? సొగసైన, అధునాతన ప్రదేశాల నుంచి హాయిగొలిపే క్రియేటివిటీ కార్నర్ల వరకు ఎంతో వైవిధ్యంగా తమ వ్యక్తిగత అభిరుచులు, వృత్తిపరమైన అవసరాలను ప్రతిబింబించేలా ఇంట్లో పని వాతారణాన్ని సృష్టించుకున్నారు. మనదేశంలోని ప్రముఖ తారలు కొందరు తమ ఇంటి కార్యాలయాలను ఎలా డిజైన్ చేసుకున్నారు? వాటిని చూసి మీ సొంత వర్క్ స్పేస్ ను మీరు ఎలా మార్చుకోవచ్చో చూద్దామా?

అలియా భట్: ఫంక్షనల్ వర్క్ స్సేస్

అలియా భట్ హోమ్ ఆఫీస్ ఆలోచనాత్మక రూపకల్పన శక్తికి నిజమైన నిదర్శనం. ఆమె తన నటనా వృత్తితో పాటు వ్యవస్థాపక వెంచర్లతో ప్రసిద్ధి చెందారు. అలియా ముంబై ఇంట్లో విస్తృతమైన, బహుళ-ఫంక్షనల్ వర్క్ స్పేస్‌ను కలిగి ఉన్నారు. రూపిన్ సుచక్ రూపొందించిన 2,800 చదరపు అడుగుల ఆఫీస్ మృదువైన పాస్టెల్స్, సమకాలీన అలంకరణల సమ్మేళనంతో అద్భుతంగా ఉంటుంది. ఫలితంగా ప్రశాంతమైన, స్ఫూర్తిదాయకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆఫీసులో విశాలమైన మీటింగ్ రూమ్, హాయిగా ఉండే వానిటీ కార్నర్, ఇంగ్లిష్ శైలి కిచెన్, నగరానికి అభిముఖంగా నిర్మలమైన బాల్కనీ ఉన్నాయి.

ఆమె నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్, ఆమె సస్టైనబుల్ చిల్డ్రన్స్ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మకు ప్రధాన కార్యాలయంగా ఇది పని చేస్తోంది. అలియా కార్యాలయం పని వాతవరణంతోపాటు సృజనాత్మక అభయారణ్యంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన రంగులు, ఆధునిక ఫర్నిచర్ ఈ స్థలాన్ని అటు అందంతోపాటు ఇటు ఉత్పాదకతను ఎలా సమతుల్యం చేసుకోవాలో చెప్పడానికి సరైన ఉదాహరణ.

ట్వింకిల్ ఖన్నా: కలర్‌ఫుల్ క్రియేటివ్ కార్నర్

ట్వింకిల్ ఖన్నా హోమ్ ఆఫీస్ అనేది స్టైల్, కంఫర్ట్ ని ఎలా మిళితం చేయాలో చెబుతుంది. వర్క్ స్పేస్ కోసం ఆమె ముంబై ఇంట్లో ఓ చక్కని కార్నర్ ను ఎంచుకున్నారు. తనకు ఇష్టమైన పుస్తకాలతో కూడిన బుక్ షెల్ఫ్ ఆ ఆఫీసుకే ప్రత్యేక ఆకర్షణ. అలాగే, చుట్టూ చేసిన అలంకరణ ప్రశాంతతను కల్పిస్తుంది. ఓ సొగసైన బ్లాక్ డెస్క్, చిక్ ఆఫీస్ కుర్చీ, నోట్స్ కోసం పిన్ బోర్డు వంటి మినిమలిస్ట్, ఫంక్షనల్ సెటప్ ఏర్పాటు చేశారు.

అలాగే ఓ డెడాన్ డే బెడ్ విశ్రాంతి తీసుకోవడానికి, మేధోమథనం చేయడానికి ఉపకరిస్తుంది. ఓ చిన్న ఫ్యాన్ అక్కడ గాలిని తాజాగా ఉంచుతుంది. ట్వింకిల్ ఖన్నా కార్యాలయం వ్యక్తిగతంగా, ఆహ్వానించదగినదిగా భావించే స్థలాన్ని ఎలా తయారు చేయాలో చెబుతుంది. అదే సమయంలో ఉత్పాదకతకు అవసరమైన పరిస్థితులు కూడా అందిస్తుంది.

షారూఖ్ ఖాన్: హోమ్ ఆఫీసుల్లో రారాజు

హోమ్ ఆఫీస్ గొప్పతనం విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ ముంబై మాన్షన్.. మన్నత్‌లోని ఆఫీస్ దే కిరీటం. విలాసవంతమైన ప్రేమకు పేరుగాంచిన షారుఖ్ కార్యాలయం చక్కదనం, సౌకర్యాల సమ్మేళనంతో ఉంటుంది. అలాగే చక్కని లెదర్ ఫర్నిచర్, ఎర్తీ కరల్ టోన్లు హాయి గొలిపే వెచ్చని వాతావరణం సృష్టిస్తుంది. ట్రోఫీలు, ప్రశంసల షీల్డులతో నిండిన ఓ అల్మారా.. ఖాన్ విశిష్టమైన వృత్తిని ప్రదర్శిస్తుంది. ఖరీదైన బ్రౌన్ సోఫాలు ఆఫీసుకే ప్రత్యేక ఆకర్షణ.

సమావేశాలకు, విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. నియో-క్లాసికల్ కాలమ్‌లు, ఐశ్వర్యవంతమైన డిజైన్ అంశాలు రాయల్టీని జోడిస్తాయి. షారుఖ్ ఆఫీస్.. సృజనాత్మక, వ్యాపార బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి సరైన స్థలం. చక్కగా నిర్వహించే, విలాసవంతమైన ఆఫీస్.. ఉత్పాదకతను, స్ఫూర్తిని ఎలా పెంచుతుందో చెప్పడానికి షారుఖ్ ఆఫీస్ ఓ అద్భుతమైన ఉదాహరణ.

అమితాబ్ బచ్చన్: సృజనాత్మక స్వర్గం

అమితాబ్ బచ్చన్ ముంబై బంగ్లా.. జల్సా ఆయన కళాత్మక సున్నితత్వానికి నిదర్శనం. ఆయన ఆఫీస్ గది సమకాలీన, పాతకాలపు అలంకరణల మిశ్రమంతో నిండి ఉంటుంది. ఇందులో పెయింటింగ్‌లు, శిల్పాలు, పలు ఇన్ స్టాలేషన్లు బాగా ఆకట్టుకుంటాయి. అవన్నీ ఆ ప్రదేశానికి జీవం చేకూరుస్తాయి. గది మధ్యలో టఫ్టెడ్ లెదర్ ఆలివ్ సోఫా, సొగసైన కాఫీ టేబుల్, ప్రత్యేకంగా రూపొందించిన డెస్కులు ఏర్పాటు చేశారు. ఓ పెద్ద బుక్ షెల్ఫ్, కనువిందు చేసే లైట్ ఫిక్చర్లు అదనపు ఆకర్షణ.

కుండీల్లో ఏర్పాటు చేసిన మొక్కలు సహజమైన అనుభూతిని మరింత మెరుగుపరుస్తాయి. ఫంక్షనల్, స్పూర్తిదాయకమైన వర్క్ స్పేస్‌ను రూపొందించాలని చూస్తున్న వారికి అమితాబ్ క్రియేటివిటీ హబ్.. ఓ ప్రదేశంలో పని, కళను ఎలా మిళితం చేయాలో చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ.

ప్రియాంకా చోప్రా: అసాధారణమైన స్టైలిష్ స్పేస్

ప్రియాంకా చోప్రా కు లండన్ లో ఉన్న హోమ్ ఆఫీస్ బాలీవుడ్‌లోని ప్రముఖులలో అసాధారణమైన, స్టైలిష్ స్పేస్‌లలో ఒకటి. ఆమె వర్క్ స్పేస్ బెడ్‌రూమ్‌ కంటే రెట్టింపు ఉంటుంది. ఆమె సృజనాత్మక, లోఫ్ట్-స్టైల్ సెటప్‌ అదిరిపోతుంది. గోడలు రంగురంగుల గ్రాఫిటీ కళతో అలంకరించి ఉంటాయి. అయితే సహజమైన తెలుపు డెస్క్, ఫర్నిచర్ అన్నీ కలిపి ఆ గదికి ఓ కళాత్మక ప్రకంపనలు సృష్టిస్తాయి.

ప్రియాంకా చోప్రా వర్క్ స్పేస్ ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ స్థలం సౌకర్యవంతం, క్రియాత్మకంగా ఉంటుంది. ఆమె హోమ్ ఆఫీస్ కొద్దిగా సృజనాత్మకత, వ్యక్తిగత శైలి చాలా నిరాడంబరమైన ప్రదేశాలను కూడా ఉత్పాదక పని వాతావరణాలుగా మార్చగలదని రుజువు చేస్తుంది.

మనీష్ మల్హోత్రా: ఎల్లలు లేని సృజనాత్మకత

ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా హోమ్ ఆఫీస్ ఎల్లలు లేని ఆయన సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది. మనీష్ ముంబై నివాసంలో ఉన్న ఆయన ఆఫీసు అధునాతనమైనదే కాదు.. ఎంతో స్ఫూర్తినిస్తుంది. గతంలో డైనింగ్ టేబుల్ ఇప్పుడు ఆధునికమైన, పిస్తా రంగు డెస్కుగా మారింది. ఆయన తన తాజా డిజైన్లను దానిపైనే రూపొందిస్తారు. 1970ల నాటి న్యూయార్క్ నగరం పెద్ద పెయింటింగ్ గోడపై కనిపిస్తుంది. ఫ్లోర్ టు సీలింగ్ కిటికీలు సహజమైన వెలుతురు అందిస్తాయి. ఈ హోమ్ ఆఫీస్.. శైలి, సౌలభ్యం, సృజనాత్మకత యొక్క కచ్చితమైన సమ్మేళనం.

This website uses cookies.