ప్రభుత్వమే ఈ సిటీని అభివృద్ధి చేసిందని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదని గుర్తుంచుకోవాలి. నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్.. నగరంలోనే ప్రప్రథమంగా.. తెల్లాపూర్‌లో ఈ లైఫ్ స్టయిల్ సిటీని అభివృద్ధి చేసింది. ఒక్కసారి మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు సర్వీస్ రోడ్డు నుంచి ఉస్మాన్ నగర్ మీదుగా తెల్లాపూర్ వెళుతుంటే.. విశాలమైన రహదారులు గల లైఫ్‌స్టయిల్ సిటీ దర్శనమిస్తుంది. సుమారు మూడు వందల ఎకరాల్లో డెవలప్ అవుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే.. మీరు ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే అనిపిస్తుంది. సుమారు మూడు ప్రాజెక్టులు పక్కపక్కనే ఉండే ఈ ప్రాంతాన్ని చూస్తే విదేశాల్లో ఉన్నామా? అనే అనుభూతి కలుగుతుంది. ఇప్పటికే గ్రీన్ డేల్ అనే విల్లా ప్రాజెక్టును సంస్థ పూర్తి చేసింది. దీని పక్కనే తాజాగా సెరీన్ డేల్, రాజపుష్ప ఇంపీరియా వంటి ప్రాజెక్టుల్ని ప్రస్తుతం నిర్మిస్తోంది. ఈ రెండు పూర్తయితే.. లైఫ్ స్టయిల్ సిటీలోకి అడుగుపెడితే చాలు.. మీ ఆనందానికి అడ్డే ఉండదని గుర్తుంచుకోండి.
హైదరాబాద్ నగరంలోనే ప్రకృతి మధ్యలో అటు విలాసవంతం.. ఇటు సౌకర్యవంతంతో కూడిన విలాసవంతమైన జీవనాన్ని కావాలనుకునేవారికి రాజపుష్ప సెరెన్ డేల్ స్వాగతం పలుకుతోంది. తెల్లాపూర్ లో 4, 5 బీహెచ్ కేల్లో అద్భుతమైన విల్లా ప్రాజెక్టు కొత్తగా లాంచ్ అయింది. అద్భుతమైన ప్రదేశంలో ఆకట్టుకునే డిజైన్ తో 270 చదరపు గజాల నుంచి 335 చదరపు గజాల మధ్యలో ఈ విల్లాలు రూపుదిద్దుకోనున్నాయి. 28.67 ఎకరాల స్థలంలో 48 శాతం ఓపెన్ స్పేస్ తో 254 ప్రీమియం లైఫ్ స్టైల్ విల్లాలు నిర్మాణం కానున్నాయి. వినోదం, ఆటవిడుపు కోసం సకల సౌకర్యాలతో 32 వేల చదరపు అడుగుల్లో గ్రాండ్ క్లబ్ హౌస్ ను డెవలప్ చేస్తున్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ హబ్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. విల్లా చూస్తే మంత్రముగ్ధులు కావడం అనిపించేలా డిజైన్ చేశారు. సుందరమైన పరిసరాలలో అధునాతనంగా నిర్మిస్తున్న ఈ విల్లాల్లో జీవితం అత్యద్భుతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 270 చదరపు గజాల్లో 3405 చదరపు అడుగుల్లో 4 బీహెచ్ కే.. 335 చదరపు గజాల్లో 4225 చదరపు అడుగుల్లో 5 బీహెచ్ కే విల్లాలు ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్ విల్లాలు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా అందమైన ల్యాండ్ స్కేపింగ్ తోపాటు స్కేటింగ్ రింక్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, యోగా, మెడిటేషన్ డెక్, వాటర్ స్కల్చర్, ఔట్ డోర్ జిమ్, యాంఫీ థియేటర్, సీనియర్ సిటిజన్స్ ప్లాజా, పిల్లల ఆటస్థలం, పెట్ పార్క్, సెంట్రల్ కోర్టు యార్డ్ వంటివి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. 32వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న గ్రాండ్ క్లబ్ హౌస్ మరో అదనపు ఆకర్షణ. ఇండోర్ గేమ్స్ తోపాటు మల్టీపర్పస్ హాల్, 4 గెస్టు సూట్లు, జిమ్నాజియం, స్పా, సెలూన్, స్విమింగ్ పూల్, కాన్ఫరెన్స్ రూమ్, గ్రాసరీ స్టోర్, టెర్రస్ పార్టీ ఏరియా, ఎంట్రన్స్ లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. రెరా అనుమతి ఉన్న ఈ ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది.
తెల్లాపూర్ లైఫ్ స్టయిల్ సిటీలో రూపుదిద్దుకుంటున్న మరో మహా ప్రాజెక్టే.. రాజపుష్ప ఇంపీరియా. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇదో స్కై స్క్రేపర్ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పటికే గ్రీన్ డేల్ విల్లా కమ్యూనిటీ పూర్తయ్యింది. తాజాగా, సెరీన్ డేల్ మరియు రాజపుష్ప ఇంపీరియా నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ రెండూ పూర్తయితే.. మొత్తం మూడు వందల ఎకరాల్లోని మూడు ప్రాజెక్టులు.. సరికొత్త లైఫ్ స్టయిల్ సిటీగా దర్శనమిస్తుంది. ఒక విదేశీ నగరంలో రూపుదిద్దుకున్న డెవలప్డ్ ఏరియా తరహాలో ఈ లైఫ్ స్టయిల్ సిటీ మీ జీవితాన్ని అతిమధురం చేసుకోవచ్చు.
This website uses cookies.