అత్యంత ఆకర్షణీయమైన ప్రాజెక్టుల్లో ఓ చక్కని ఫ్లాట్ సొంతం చేసుకోవడం చాలా కష్టమని చాలామంది అంటుంటారు. కానీ అదేమీ అసాధ్యం కాదని రాజపుష్ప ఇంపీరియా చూస్తే మీకే అర్థమవుతుంది. రాజపుష్ప ప్రాపర్టీస్ నుంచి తెల్లాపూర్ లో సరికొత్త గేటెడ్ కమ్యూనిటీని ఆవిష్కరించింది. ఇందులో ఫ్లాట్ కొంటే హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో మీకు శాశ్వత చిరునామా ఉండటం ఒక్కటే కాదు.. అత్యంత సుందరమైన గేటెడ్ కమ్యూనిటీలో మహోన్నత జీవితం గడపటం ఖాయం అనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. మీ ఇంటిని చూసి మీ స్నేహితులు, బంధుగణం అసూయపడే స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇంట్లోని ప్రతి చదరపు అడుగునూ ఆస్వాదించేలా, హాయిగొలిపే జీవనం మీ సొంతమవుతుంది.
రాజపుష్ప ఇంపీరియాను 24 ఎకరాల స్థలంలో 8 టవర్లు 40 అంతస్తులతో నిర్మాణమవుతున్నాయి. ప్రాజెక్టు విస్తీర్ణంలో 82 శాతం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం విశేషం. వర్క్ ఫ్రం హోం స్పేస్ ఉండేలా అపార్ట్ మెంట్లు తీర్చిదిద్దుతున్నారు. డెక్ తో కూడిన రెండు స్విమ్మింగ్ పూల్స్ తోపాటు సన్ డెక్ అపార్ట్ మెంట్స్ కూడా ఉన్నాయి. 2, 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు 2026 మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది.
లొకేషన్ పరంగా చూసినా ఇది మంచి ప్రాంతంలో ఉంది. తెల్లాపూర్ ఇప్పటికే చాలా బాగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐటీ హబ్ ల నుంచి సైబర్ సిటీ, గచ్చిబౌలిలోని పలు కంపెనీలు చాలా దగ్గర్లో ఉన్నాయి. రాజపుష్ప ఇంపీరియా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే పలు అంతర్జాతీయ స్కూళ్లు, ప్రముఖ విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఎంఎన్ సీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి సమీపంలోనే ఉన్నాయి. మరి అదిరిపోయే ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ధర ఎంతో తెలుసా? 2 బీహెచ్ కే ధర రూ. 95.83 లక్షల నుంచి, 3 బీహెచ్ కే ధర రూ.1.1 కోట్ల నుంచి మొదలవుతున్నాయి. 2026 మార్చినాటికి ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.
This website uses cookies.