హైదరాబాద్లోని మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, ప్రగతి నగర్ వంటి ప్రాంతాల్లో అపార్టుమెంట్ల నిర్మాణం ఊపందుకుంది. ముఖ్యంగా, మియాపూర్ మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాన బిల్డర్ల దృష్టి ఈ ప్రాంతం మీద పడింది. మియాపూర్ నుంచి బాచుపల్లి మార్గంలో క్యాండియర్ 40 అనే నలభై అంతస్తుల ఆకాశహర్య్మం ఆరంభం కావడంతో.. ఒక్కసారిగా ఈ ప్రాంతం హాట్‌కేకుగా మారింది. ఈ సంస్థ ఇదే రోడ్డులో మరొక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
అక్కడ సుమారు 45 అంతస్తుల ఆకాశహర్మ్యం కడుతోందని సమాచారం. దానిపక్కనే టీమ్ ఫోర్ అనే సంస్థ.. ఆరు ఎకరాల్లో 929 ఫ్లాట్లను కడుతోంది. మొత్తానికి, మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి చౌరస్తా దాకా.. సుమారు ఆరు వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇక్కడున్న ఏకైక ప్రతికూలత ఏమిటంటే.. ఘాటైన రసాయన వాసనలు ఈ ప్రాంత వాసుల్ని అప్పుడప్పుడూ పలకరిస్తాయి.
ఇక్కడ సుమారు 25 సంస్థలు.. 133 ఎకరాల్లో 98 టవర్లను నిర్మిస్తున్నాయి. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. దాదాపు 12,587. ధర విషయానికి వస్తే. కనీస ధర రూ.40 లక్షలు కాగా.. గరిష్ఠ రేటు రూ.1.38 కోట్లు కావడం గమనార్హం. మరి, ఏయే ప్రాజెక్టులు ఎక్కడెక్కడ నిర్మాణంలో ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేమిటంటే..
This website uses cookies.