- పోచారంలో కొత్త ప్రాజెక్టు.. ఏస్ అమురా
- సంప్రదాయం, సాంకేతికతల మేళవింపు
అటు సంప్రదాయం ఉట్టిపడే అద్భుతమైన నిర్మాణం.. ఇటు నేటి కాలానికి తగిన స్మార్ట్ పీచర్లు.. ఇంకా అందుబాటు ధరలో చక్కని అపార్ట్ మెంట్ కావాలనుకుంటున్నారా? అయితే, పోచారంలోని ఏస్ అమురా ప్రాజెక్టులో ఫ్లాట్ తీసుకోవాల్సిందే. ఇన్ఫోసిస్ కు సమీపంలో ప్రత్యేకమైన డిజైన్ తో అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ రూపుదిద్దుకుంటోంది. స్మార్ట్ ఇన్ హోం ఆటోమేషన్ సౌకర్యాలతో నాటి డిజైన్, నేటి టెక్నాలజీని మేళవించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 208 స్మార్ట్ 2 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి.
స్మార్ట్ ఎంట్రీ, ఎగ్జిట్ తోపాటు స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మేనేజ్ మెంట్, ఎక్కడైనా వైఫై తో నేటి కాలానికి తగిన విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. అలాగే పిల్లల ఆటపాటల కోసం పదికి పైగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. బాంకెట్ హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ తదితర సౌకర్యాలతో చక్కని క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. పార్కింగ్ మొత్తం బేస్ మెంట్ లోనే ఏర్పాటు చేస్తుండటంతో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎలాంటి వాహనాలూ లేకుండా ఆహ్లాదకరంగా ఉండనుంది. హైదరాబాద్-వరంగల్ హైవేకి కేవలం 5 నిమిషాల దూరంలో ఉండటం ఈ ప్రాజెక్టుకు అదనపు ఆకర్షణ. మొత్తం 1.78 ఎకరాల స్థలంలో జీ ప్లస్ 5 అంతస్తుల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు.. 2024 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. రెరా అనుమతి కలిగిన ఏస్ అమురాలో 932 చదరపు అడుగుల నుంచి 950 చదరపు అడుగుల మధ్యలో 2 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి.