Categories: TOP STORIES

బుద్వేల్‌లో డ‌బుల్ డెక్క‌ర్ ఫ్లై ఓవ‌ర్లు.. ఎలివేటెడ్ కారిడార్

  • బుద్వేల్ లేఅవుట్-ఓఆర్ఆర్ ఎలివేటెడ్ కారిడార్
  • 400 మీటర్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు
  • బుద్వేల్ లేఆవుట్ నుంచి ఔటర్ కు అనుసంధానం

బుద్వేల్‌లో సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై డబుల్ డెక్కర్ ఇంటర్‌చేంజ్ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. బుద్వేల్ ప్రాంతంలో వంద ఎకరాల్లో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్‌ను అభివృద్ది చేసింది. అక్కడ వేలంలో చాలా మంది బిల్డర్లు, నిర్మాణ సంస్థలు భూములను కొనుగోలు చేశాయి. మరికొన్ని ఫ్లాట్లు విక్రయించాల్సి ఉంది. రానున్న రోజుల్లో బుద్వేల్ లోని మరో 200 ఎకరాలు భూముల్ని సైతం వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సమాయ‌త్తం అవుతోంది. ఇక ఇప్పటికే భూములు కొనుగోలు చేసిన నిర్మాణ సంస్థలు అక్కడ భారీగా నివాస ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికల్ని సిద్దం చేశాయి. దీంతో బుద్వేల్ కు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై డబుల్ డెక్కర్ ఇంటర్‌ చేంజ్ నిర్మాణానికి సిద్ధమయ్యింది ప్రభుత్వం. హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి ఓఆర్ఆర్ పైకి ఈజీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు.

This website uses cookies.