ఇండియాతోపాటు అటు లాస్ ఏంజిల్స్ తన జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ వస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ముంబైలో నాలుగు అపార్ట్ మెంట్లను విక్రయించారు. అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న నాలుగు లగ్జరీ అపార్ట్ మెంట్లను రూ.16.17 కోట్లకు అమ్మారు. ఈ నాలుగు అపార్ట్ మెంట్లు ఒబెరాయ్ స్కై గార్డెన్స్ ప్రాజెక్టులో ఉన్నాయి. ఖండ్‌వాలా కాంప్లెక్సులోని ప్రాజెక్ట్ ఒబెరాయ్ స్కై గార్డెన్స్ లోని 18వ అంతస్తులో మూడు ఫ్లాట్లు, 19 అంతస్తులో ఒకటి ఉన్నాయి. 18వ అంతస్తులో ఉన్న మూడు అపార్ట్ మెంట్లలో ఒకటి 1075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని రూ.3.45 కోట్లకు విక్రయించగా.. కొనుగోలుదారు రూ.17.26 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించారు.
ఈ ఫ్లాట్ కు కారు పార్కింగ్ ఉంది. 885 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండో అపార్ట్ మెంట్ ను రూ.2.85 కోట్లకు అమ్మగా.. స్టాంపు డ్యూటీ కింద రూ.14.25 లక్షలు చెల్లించారు. దీనికి కూడా ఓ కార్ పార్కింగ్ ఉంది. 18, 19వ అంతస్తులో ఉన్న 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జోడీ అపార్ట్ మెంట్ రూ.3.52 కోట్లకు అమ్మారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ.21.12 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించారు. అలాగే నాలుగో అపార్ట్ మెంట్ (డూప్లెక్స్) కూడా 18, 19 అంతస్తుల్లో ఉంది. ఇది 1985 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని రూ.6.35 కోట్లకు విక్రయించగా.. రూ.31.75 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించారు. ఈ ఫ్లాట్లతో రెండు కార్ పార్కింగ్ స్థలాలు వస్తాయి.
ఈ నెల 3న రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 2024లో ప్రియాంకా చోప్రా కుటుంబం పుణెలోని కోరెగావ్ పార్కులో ఉన్న బంగ్లాను ది అర్బన్ నోమాడ్స్ కమ్యూనిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు నెలకు రూ.2 లక్షల అద్దెకు ఇచ్చారు. అలాగే 2023లో ఆమె లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో 2,292 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన రెండు పెంట్ హౌస్ లను రూ.6 కోట్లకు విక్రయించారు. అమెరికా గాయకుడు నిక్ జోనాస్ తో వివాహం తర్వాత ప్రియాంకా చోప్రా 2018లో లాస్ ఏంజిల్స్ వెళ్లారు.
This website uses cookies.