Categories: TOP STORIES

రెండు ప్ర‌క‌ట‌న‌లు.. రెట్టింపు ఉత్సాహం

న‌గ‌ర రియ‌ల్ రంగానికి కాస్త ఊత‌మిచ్చే రెండు ప్ర‌క‌ట‌న‌లు ఈ వారం వెలువ‌డ్డాయి. దీని వ‌ల్ల అమ్మ‌కాలు పెరుగుతాయ‌నో.. మార్కెట్‌కు రెక్క‌లొస్తుంద‌నో చెప్పలేం కానీ.. కాస్త సానుకూల వాతావ‌ర‌ణం అయితే ఏర్ప‌డుతుంది. ఆఫీసు మార్కెట్లో మ‌ళ్లీ క‌ద‌లిక‌లు ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. గ‌త ఏడాదిన్న‌ర నుంచి ఆఫీసు స్పేస్ కుప్ప‌కూలింద‌నే వార్త‌ల నుంచి సానుకూలత వైపు మార్కెట్ ప‌య‌నిస్తోంద‌ని చెప్పొచ్చు.

జేపీ మోర్గాన్ ఆసియా పసిఫిక్‌లోనే అతిపెద్ద క్యాంప‌స్ ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మాదాపూర్‌లోని సాలార్ పురియా స‌త్వా నాలెడ్జి సిటీని ఇందుకు ఎంచుకున్నామ‌ని వెల్ల‌డించింది. ఆఫీసు విస్తీర్ణం ఎంత‌లేద‌న్నా 8.22 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఏర్పాటు కానుంది. ఇక్క‌డ్నుంచి అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల్ని అంద‌జేస్తారు. టెక్నాల‌జీ, రిస్క్‌, ఆప‌రేష‌న్స్‌, ఇత‌ర‌త్రా సేవ‌ల్ని అంద‌జేస్తారు. ఈ కొత్త కార్యాల‌యం మా ఖాతాదారుల అవ‌స‌రాల్ని తీర్చుతుంది. మా నిబ‌ద్ధ‌త‌కు ఇదే బ‌ల‌మైన నిద‌ర్శ‌నం. ఉద్యోగుల‌కు ప్ర‌పంచ స్థాయి ప‌ని వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తామ‌ని సంస్థ అధికారి తెలిపారు.

మ‌ల‌బార్ గోల్డ్ రూ.750 కోట్ల పెట్టుబ‌డి

మ‌ల‌బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తెలంగాణ‌లో గోల్డ్ అండ్ డైమండ్ జ్యుయెల‌రీ ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఆరంభిస్తోంద‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబ‌డులు పెడుతోంద‌ని వెల్ల‌డించారు. దీంతో 2500 మందికి ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. ఇటీవ‌ల మ‌ల‌బార్ గోల్డ్ ప్ర‌తినిధులు మంత్రి కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో క‌జ‌కిస్థాన్ కాన్సులేట్ నాసిర్ అలీ ఖాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

This website uses cookies.