Categories: CONSTRUCTION

జిగేల్.. జిప్సం కాంక్రీటు..

ప్రపంచవ్యాప్తంగా జిప్సం కాంక్రీటు మార్కెట్ వార్షికంగా ఎనిమిది శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో బహుళ అంతస్తులు పెరుగుతున్నాయి. వీటిలోనే బేస్మెంట్ పార్కింగ్ కడుతున్నారు. ఫ్లాట్లన్నీ దగ్గరగా ఉండటం వల్ల శబ్ద కాలుష్యం, వేడిని నివారించే నిర్మాణ సామగ్రిని వినియోగించాల్సి వ‌స్తుంది. ఇలాంటి వాటిలో జిప్సం బోర్డు అతికినట్లు సరిపోతుంది.

భారతదేశంలో వచ్చే ఏడేళ్లలో 6 కోట్ల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అంచనా. అంటే, ఎంతలేదన్నా ఈ రంగంలో 1.3 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారు. 2024 నాటికల్లా అందుబాటు గృహాలదే 70 శాతం వాటా కలిగి ఉంది. పైగా, 2022 లోపు అందరికీ ఇళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అంశాల వల్ల జిప్సం కాంక్రీటుకు మంచి గిరాకీ పెరగడానికి ఆస్కారం ఉందని నిపుణులు అంటున్నారు.

This website uses cookies.