Categories: INDUSTRY ISSUES

రియల్ లావాదేవీల్లో ద్వంద్వ పన్ను తీసేయాలి

  • బిల్డర్ల వినతి

రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ద్వంద్వ పన్ను విధానం తీసేయాలని పలువురు బిల్డర్లు కోరుతున్నారు. భూమిని కొనుగోలు చేసి అభివృద్ది ఒప్పందం చేసుకున్నప్పుడు తాము స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నామని.. ఆ ఇళ్లను విక్రయించిన తర్వాత కొనుగోలుదారులు మరోసారి స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను రెండుసార్లు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. దీనివల్ల బయ్యర్, ఇన్వెస్టర్లపై అనవసరంగా అదనపు భారం పడుతోందన్నారు. దీనిని నివారించేందుకు బయ్యర్ లేదా ఇన్వెస్టర్ కు ఇన్ పుట్ క్రెడిట్ ను జీఎస్టీ విధానంలో ఉన్నట్టే ఇవ్వాలని సూచిస్తున్నారు.

భూ యజమాని, బిల్డర్ మధ్య జాయింట్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ విషయంలో కూడా పన్ను విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. రిజిస్ట్రేష్ చార్జీలపై భూ యజమాని ఒక శాతం, డెవలపర్ 2 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించేలా చూడాలంటున్నారు. ఈ విషయంలో రాజస్థాన్ బిల్డర్లు ప్రభుత్వానికి పలు వినతులు చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేరళ వంటి రాష్ట్రాలు ఇప్పటికే గ్రీన్ బిల్డింగులపై స్టాంపు డ్యూటీలో ఒక శాతం మినహాయింపు ఇస్తున్నాయి. కేరళలో గ్రీన్ బిల్డింగులపై ఆస్తి పన్ను కూడా 20 శాతం మేర తగ్గించారు.

This website uses cookies.