Categories: LEGAL

హీరా గోల్డ్ కుంభకోణంలో రూ.78 కోట్ల ఆస్తుల అటాచ్

హీరా గోల్డ్ కుంభకుణం కేసులో ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, నీలాంచల్ టెక్నోక్రాట్స్ కి చెందిన రూ.78 కోట్ల విలువైన స్థిర, చరాస్థులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. హీరా గ్రూప్ కు చెందిన నౌహీరా షేక్ టోలిచౌకిలో ప్రాపర్టీల కొనుగోలు కోసం రూ.148 కోట్లను ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కి బదిలీ చేశారు. అందులో రూ.70 కోట్లతో ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. మిగిలిన రూ.78 కోట్లు ఎస్ఏ బిల్డర్స్ వద్దే ఉన్నట్టు ఈడీ గుర్తించింది.

అయితే, అందులో రూ.41 కోట్లు నీలాంచల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోపాటు కోల్ కతా, షిల్లాంగ్ లకు చెందిన నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్టు కనుగొంది. తిరిగి ఆ మొత్తం రుణాల రూపేణా సాలార్ పురియా సట్టావా అనే అనే రియల్ ఎస్టేట్ గ్రూప్ కి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ గతనెల 7న ఆ కంపెనీపై సోదాలు చేసి, రూ.78 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఎస్ఏ బిల్డర్స్, నీలాంచల్ టెక్నోక్రాట్స్ ఆస్తులను జప్తు చేసింది.

This website uses cookies.