Categories: LATEST UPDATES

నిర్మాణ సైట్ల వద్ద.. డస్ట్ పొల్యూషన్ సెన్సర్లు

నిర్మాణ ప్రదేశాల్లో వచ్చే దుమ్ము, ధూళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ చుట్టుపక్కల ప్రదేశాల నిండా అవి వ్యాపించి కాలుష్యమయం అవుతాయి. ఇదంతా అక్కడ ఉంటున్న జనాలు ఇబ్బందికరంగా ఉంటుంది.

 

ఈ నేపథ్యంలో దీనిని నిరోధించేందుకు డస్ట్ పొల్యూషన్ సెన్సర్లు ఏర్పాటు చేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. నగరాల్లో వాయు కాలుష్యం పెరగడానికి ఇవి కూడా ఓ కారణమని, అందువల్ల దీనిని నిరోధించే చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ దిశగా ముందడుగు వేసింది. అక్కడ నిర్మాణ సైట్లలో డస్ట్ పొల్యూషన్ సెన్సర్ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో హైదరాబాద్ కూడా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

This website uses cookies.