ఈస్ట్ హైదరాబాద్‌కే సరికొత్త అందాన్ని అద్దేందుకు వాసవి గ్రూప్ నడుం బిగించింది. ఈస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటూ… ఎత్తయిన ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది. వాసవి క్రౌన్ ఈస్ట్ అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్టు ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హెచ్ఎండీఏ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో ఈ నిర్మాణాన్ని ఆరంభించింది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఉన్న వాసవి క్రౌన్ ఈస్ట్‌లో నివసించేవారు.. అలా నడుచుకుంటూ మెట్రో ఎక్కితే చాలు.. కేవలం అరగంటలో నగరం నలువైపులా ఎక్కడికైనా వెళ్లొచ్చు.
వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్టును సుమారు 1.93 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నిర్మాణం వచ్చేది కేవలం 25 శాతం స్థలంలోనే. 34 అంతస్తుల ఎత్తులో కడుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 324 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. చివరి రెండు అంతస్తుల్ని స్కై విల్లాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులోని 26,600 చదరపు అడుగుల క్లబ్ హౌజ్ నివాసితుల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్‌ని అభివృద్ధి చేస్తున్నారు.
* క్రౌన్ ఈస్ట్ ప్రత్యేకత ఏమిటంటే.. కనెక్టివిటీ, లగ్జరీ పక్కపక్కనే ఉంటున్నట్లుగా కనిపిస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డులోని వంద అడుగుల రోడ్డు నుంచి ప్రాజెక్టుకు సులువుగా చేరుకోవచ్చు. సుమారు ఐదు వందల ఎకరాల మేర విస్తరించిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లో హెచ్ఎండీఏ ప్రపంచస్థాయిలో అమెనిటీస్‌ను పొందుపర్చింది. బడా రోడ్లు, అండర్ గ్రౌండ్ కేబ్లింగ్, లేఅవుట్ కోసం భారీ నీటి నిల్వ సౌకర్యం వంటివి అభివృద్ధి చేసింది. క్రౌన్ ఈస్ట్ నుంచి అలా నడుచుకుంటూ మినీ శిల్పారామంకు చేరుకోవచ్చు. ఇక్కడ్నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆస్పత్రులు, స్కూళ్లు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు వంటివి ఉన్నాయి. ఎల్‌బీనగర్, దిల్‌సుక్‌నగర్, రామంతపూర్, హబ్సీగూడ వంటివి సమీపంలోనే ఉండటం విశేషం.
ఉప్పల్‌లోనే అత్యంత ఎత్తయిన ప్రీమియం రెసిడెన్షియల్ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నాం. నాణ్యమైన రీతిలో అత్యుత్తమ సదుపాయాల్ని పొందుపరుస్తున్నాం. దీని పక్కనే వాసవి మెట్రోపాలిస్ విజయవంతమైన ప్రాజెక్టు. అందులో కొన్నవారు నిర్మాణ నాణ్యత, అందులో పొందుపర్చిన సదుపాయాల్ని చూసి సంతృప్తి చెందారు. ఇదే తరహాలో క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్టును విజయవంతంగా తీర్చిదిద్దుతాం.– ఎర్రం విజయ్ కుమార్, సీఎండీ, వాసవి గ్రూప్
ఈస్ట్ హైదరాబాద్‌లోనే మా ఈ క్రౌన్ ఈస్ట్ ఆకాశహర్మ్యం ఐకానిక్ ప్రాజెక్టుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తు సూత్రాలకు అనుగుణంగా, మూడు వైపులా రోడ్లు ఉండే ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నాం. రెరా అనుమతి లభించిన ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోపే కొనుగోలుదారులకు అందజేస్తున్నాం. మేం ఊహించిన దానికంటే అధిక ఆదరణ క్రౌన్ ఈస్ట్‌కు లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – అభిషేక్ చందా- సౌమ్య చందా, డైరెక్టర్లు- వాసవి గ్రూప్
This website uses cookies.