Categories: TOP STORIES

సౌత్ హైద‌రాబాద్‌లో సొగ‌సైన ల‌గ్జ‌రీ విల్లాలు

ఫేస్‌ ఆఫ్‌ ద హైద్రాబాద్‌గా వెస్ట్‌జోన్‌ ఉన్నప్పటికీ.. రియాల్టీ సెక్టార్‌లో నాణేనికి రెండో వైపు చూస్తే- కావాల్సినంత ల్యాండ్‌ బ్యాంక్‌.. ధరలు అందుబాటులో ఉన్న ప్రాంతం మాత్రం దక్షిణ హైద్రాబాదే. పైగా ఇప్పుడక్కడ డెవలప్మెంట్‌ కూడా ఫాస్ట్‌ట్రాక్‌ ఎక్కింది. సౌత్‌జోన్‌ అయినప్పటికీ శంషాబాద్‌, తుక్కుగూడ లాంటివి ఐటీ కారిడార్‌కు దగ్గరగా ఉండటంతో ఇక్కడ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు బయ్యర్లు. ఫ్లాట్స్‌ కంటే విలాసవంతమైన విల్లాలకే ఓటేస్తున్నారు. మరి రెరా అనుమతులు పొందిన విల్లా ప్రాజెక్ట్‌ల వివరాలు.. వాటి కన్‌స్ట్రక్షన్‌ స్టేటస్ ఏమిటీ?

అభివృద్ధి అంటే పశ్చిమ హైద్రాబాదే. ఈ ఏరియాకున్న డిమాండ్‌ను అందరూ అంగీకరిస్తారు. అదే సమయంలో హైద్రాబాద్‌ అంటే ఒక్క వెస్ట్‌జోనో.. ఐటీ కారిడార్ మాత్రమే కాదన్నట్టు వేగంగా వృద్ధి చెందుతున్నాయి మిగిలిన ఏరియాలు. నగరంతో పాటు బోనగిరి, తుక్కుగూడ, మహేశ్వరం, శంషాబాద్‌ సహా ప్రతి మూలకు హైద్రాబాద్ విస్తరిస్తోందిప్పుడు. మహేశ్వరం, యాదాద్రి- బోనగిరి, తుక్కుగూడ, శామీర్‌పేట ఇవన్నీ గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్ ఏరియాలకు అనుబంధ ప్రాంతాలుగా మారుతున్నాయిప్పుడు.

ఐటీ.. ఎంఎన్‌సీ కంపెనీల ఉద్యోగులంతా తాము నివాసం ఉండటానికి ఈ ప్రాంతాలు అనువైనవిగా భావిస్తుండటంతో ఈ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకొంది. అన్నింటి కంటే ముఖ్యమైనది.. మిగిలిన జోన్లతో పొల్చితే కలిసొచ్చే విషయం ఇక్కడ ధరలు తక్కువగా ఉండటం. అందుకే జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది సౌత్‌జోన్‌ రియాల్టీ మార్కెట్. లగ్జరీ విల్లాలు.. గేటెడ్ కమ్యూనిటీ.. కమర్షియల్ స్పేస్‌లు.. అదే సమయంలో బడ్జెట్ రెసిడెన్షియల్‌ ప్లాట్స్‌ అండ్‌ ఫ్లాట్స్ ఏది కావాలన్నా దక్షిణాది వైపే చూస్తున్నారు బయ్యర్లంతా. ట్రాన్స్‌పోర్టేషన్‌ కూడా పెరగడంతో వీకెండ్స్‌ రిలాక్స్‌ అవడానికి ఈ ఏరియాల్లో విల్లాస్‌ కొనడానికి ప్రిఫర్‌ చేస్తున్నారు బయ్యర్లు.

ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర్నుంచి ఎక్స్‌ప్రెస్‌వేలు.. ఫ్లైఓవర్లతో కనెక్టివిటీ పెరుగుతుండటంతో దక్షిణ హైద్రాబాద్‌లో నిర్మాణ రంగం పుంజుకోంటుంది. ఇప్పుడున్న ట్రెండ్‌లో మెజార్టీ బయ్యర్లు విల్లాలకే ప్రాధాన్యమిస్తున్నారు. మరి విల్లా అంటే గ్రీనరీ, స్పేస్‌, ప్రశాంతత లాంటివన్నీ చూసుకోవాల్సిందే. నగరంలో ఈ టైప్‌ ఆఫ్‌ కంఫర్ట్స్‌ అంటే కష్టమే. అందుకే శివారు ప్రాంతాల వైపు చూస్తున్నారు వినియోగదారులు. తక్కువ బడ్జెట్‌లో కావాల్సినంత కంఫర్టబుల్‌గా విల్లాలు నిర్మిస్తుండటంతో దూరమైనా సరే వీటికే ఓటేస్తున్నారు. ముఖ్యంగా సౌత్‌జోన్లోని శంషాబాద్‌, తుక్కుగూడల్లో లగ్జరీ విల్లాలు వెలుస్తున్నాయ్‌.
నగరంలో కొనలేని వారంతా శంషాబాద్‌ నుంచి ఆదిభట్ల వరకు శివారు ప్రాంతాల వైపు చూస్తున్నారు. సిటీకి దగ్గరగా ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో శంషాబాద్‌, తుక్కుగూడ ప్రధానమైనవి. ఇక్కడ విలాసవంతమైన ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తున్నారు డెవలపర్లు. శంషాబాద్‌ అంటే ముందు గుర్తొచ్చేది రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టే. అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉండటంతో ఇటు నివాసపరంగానూ.. అటు వాణిజ్య కేంద్రంగానూ శంషాబాద్‌ డెవలప్‌మెంట్‌ కంటిన్యూస్ ప్రాసెస్‌గా ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఆనుకోని ఉండంటంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ సులభంగా మారింది శంషాబాద్‌ నుంచి. అందుకే రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి శంషాబాద్‌ బెస్ట్ ఛాయిస్‌గా మారింది. బయ్యర్ల నుంచి విపరీతంగా డిమాండ్ పెరగడంతో శంషాబాద్‌లో లగ్జరీ విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కమర్షియల్ స్పేస్‌లు పుట్టుకొస్తున్నాయ్‌.
హైద్రాబాద్‌ సౌత్‌ ఏరియాలో వేగంగా వృద్ధి చెందుతోన్న మరో ప్రాంతం తుక్కుగూడ. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అలాగే ఓఆర్ఆర్‌కి దగ్గరగా ఉండటంతో తుక్కుగూడ రెసిడెన్షియల్‌- వాణిజ్య కార్యకలాపాలకు సెంటర్‌గా ఉంది. విలాసవంతమైన విల్లాలు.. హై ఎండ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ. ట్రాన్స్‌పోర్టేషన్‌- కనెక్టవిటీ పరంగా దక్షిణ ప్రాంతానికి చాలా సానుకూలాంశాలున్నాయ్‌. శ్రీశైలం హైవే, బెంగళూర్‌ నేషనల్ హైవే, దగ్గర్లోనే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, ఔటర్ రింగ్‌ రోడ్‌ మీదుగా ఐటీ కారిడార్‌కు సులువుగా చేరుకునే వీలుండటం, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేతో నగరంలోకి ఫాస్ట్‌గా రీచ్‌ అయ్యే అవకాశం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు వీలుగా శివరాంపల్లి.. బుద్వేల్ ఎంఎంటీఎస్‌ స్టేషన్లు.. సమీపంలోనే ఇన్నర్‌ రింగ్ రోడ్‌ ఉండటంతో ఇవన్నీ సౌత్‌జోన్లో రియాల్టీ ఊపందుకోడానికి తమ వంతు సాయం చేస్తున్నాయ్‌.

లొకేషన్‌- మామిడిపల్లి, శంషాబాద్‌
కంపెనీ- కాసాగ్రాండ్‌
ప్రాజెక్ట్‌- కాసాగ్రాండ్‌ హాన్‌ఫోర్డ్‌
టోటల్‌ ల్యాండ్‌ ఏరియా- 10.1 ఎకరాలు
ప్రాజెక్ట్‌ టైప్‌- 4 బీహెచ్‌కే విల్లా
యూనిట్‌ సైజ్‌- 2800-2804 చ.అ
రెరా నంబర్‌- P02400006229

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో కాసాగ్రాండ్‌ డెవలప్‌ చేస్తోన్న అత్యంత విలాసవంతమైన విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టే కాసాగ్రాండ్‌ హాన్‌ఫోర్డ్‌. 10.1 ఎకరాల్లో వృద్ధి చేస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో 140 బ్రిటిష్‌ స్టైల్‌ అల్ట్రా లగ్జరియన్‌ ఫోర్‌ బీహెచ్‌కే విల్లాలను నిర్మిస్తోంది కాసాగ్రాండ్‌. 60కి పైగా వరల్డ్‌క్లాస్‌ స్టాండర్డ్స్‌తో లైఫ్‌స్టైల్‌ అమెనిటీస్‌ని ఏర్పాటు చేస్తోంది. కనెక్టివిటీ చూస్తే ఐదు నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌, 12 నిమిషాల్లో ఉందానగర్‌ రైల్వే స్టేషన్‌, 15 నిమిషాల్లో శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ చేరుకోవచ్చు. 20 నిమిషాల్లో కిడ్జీ ప్రీ స్కూల్‌, 16 నిమిషాల్లో జీఎంఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌, 28 నిమిషాల్లో ఎంవీఎస్‌ఆర్‌ కాలేజ్‌, అరగంట దూరంలో స్ఫూర్తి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఉన్నాయ్‌. ట్వంటీ మినిట్స్‌ డిస్టెన్స్‌లో ట్రైడెంట్‌ సూపర్‌ స్పెషాల్టీ హాస్పిటల్‌, ఇందిరా హాస్పిటల్‌ ఉన్నాయి ఇక్కడ. అలాగే 20 నిమిషాల్లో కోకాపేట, 30 నిమిషాల్లో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లాంటి ముఖ్యమైన ప్రాంతాల్ని రీచ్‌ అవ్వొచ్చు. హాన్‌ఫోర్డ్‌ ప్రాజెక్ట్‌ నుంచి తొమ్మిది నిమిషాల్లో అదానీ ఏరోస్పేస్‌ పార్క్‌, 10 నిమిషాల్లో జీఎంఆర్‌ ఏరో స్పేస్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌, 22 నిమిషాల దూరంలో ఫ్యాబ్‌ సిటీ ఉన్నాయ్‌.

లొకేషన్‌- తుక్కుగూడ
కంపెనీ- స్పీడ్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌
ప్రాజెక్ట్‌- స్పీడ్‌ కాన్‌స్టెల్లా
టోటల్‌ ల్యాండ్‌ ఏరియా- 27 ఎకరాలు
ప్రాజెక్ట్‌ టైప్‌- 4, 5 బీహెచ్‌కే విల్లా
యూనిట్‌ సైజ్‌- 4250- 5400 చ.అ
రెరా నంబర్‌- P02400005412

తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 14కి సమీపంలో 4 వేల 250 నుంచి 5 వేల 400 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో విల్లాలు నిర్మిస్తోంది స్పీడ్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌. 27 ఎకరాల్లో నిర్మిస్తోన్న స్పీడ్‌ కాన్‌స్టెల్లా గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్‌లో 183 ఫోర్‌ అండ్‌ ఫైవ్‌ బీహెచ్‌కే యూనిట్స్‌ రానున్నాయ్‌. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఒక నిమిషంలో ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 14కి చేరుకోవచ్చు. ఇక ఐదు నిమిషాల్లో ఈ-సిటీ, అమెజాన్‌ డాటా సెంటర్‌, ఎనిమిది నిమిషాల్లో అదానీ ఏరో స్పేస్‌ పార్క్‌, నోవాటెల్‌, తొమ్మిది నిమిషాల్లో వండర్‌ లా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, అఘాఖాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, 10 నిమిషాల్లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, హార్డ్‌వేర్‌ పార్క్‌, జీఎంఆర్‌ ఏరో స్పేస్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌, 15 నిమిషాల్లో టీసీఎస్‌ ఆదిభట్ల, స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ, 30 నిమిషాల్లో గచ్చిబౌలి, ఫార్మాసిటీని రీచ్‌ అవ్వొచ్చు.

లొకేషన్‌- శంషాబాద్‌
కంపెనీ- వైష్ణవి గ్రూప్‌
ప్రాజెక్ట్‌- వైష్ణోయ్‌ సౌత్‌ఉడ్స్‌
టోటల్‌ ల్యాండ్‌ ఏరియా- 43.5 ఎకరాలు
ప్రాజెక్ట్‌ టైప్‌- 4, 5 బీహెచ్‌కే విల్లాలు
యూనిట్‌ సైజ్‌- 4433- 7773 చ.అ
రెరా నంబర్‌- P02400008419

శంషాబాద్‌లో విల్లాలను డెవలప్‌ చేస్తోన్న మరో ప్రధాన కంపెనీ వైష్ణవి గ్రూప్‌. వైష్ణోయ్‌ సౌత్‌ఉడ్స్‌ పేరుతో అందమైన ఫోర్‌ అండ్‌ ఫైవ్‌ బీహెచ్‌కే విల్లాలను ఆఫర్‌ చేస్తోంది ఈ సంస్థ. మొత్తం 43.5 ఎకరాల్లో కన్‌స్ట్రక్ట్‌ అవుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో 4 వేల 433 నుంచి 7 వేల 773 చదరపు అడుగుల విస్తీర్ణంలో 260 విల్లా యూనిట్స్‌ రానున్నాయ్‌. 40 ఫీట్‌ వైడ్‌ రోడ్స్‌, ఎక్స్‌పాన్సివ్‌ గోల్ఫ్‌ టర్ఫ్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్‌, క్లబ్‌హౌస్‌, జాగింగ్‌ ట్రాక్‌, యోగా పెవిలియన్‌, ఇండోర్‌ గేమ్స్‌ రూమ్‌ సహా అనేక అమెనిటీస్‌ ఉన్నాయిందులో. ఇక ప్రాజెక్ట్‌ ఉన్న లొకేషన్‌ నుంచి రెండు నిమిషాల్లో కొత్తగా ప్రపోజ్‌ చేసిన మెట్రో స్టేషన్‌కు, 5 నిమిషాల్లో రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, 10 నిమిషాల్లో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, అఘాఖాన్‌ అకాడమీ, 10 నిమిషాల్లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, 30 నిమిషాల్లో హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రధాన ప్రాంతాలను అతి సులభంగా చేరుకోవచ్చు.

This website uses cookies.