కొత్తగా నిర్మించబోయే భవనాలకు ఇంధన సంరక్షణ నిబంధనలు పాటించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఇంధన సంరక్షణ కోడ్ తీసుకు రావాలని భావిస్తోంది. తద్వారా 2030 నాటికి 300 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని నిరోధించడం ద్వారా ఏకంగా రూ.1.20 లక్షల కోట్లను ఆదా చేయొచ్చని అంచనా వేస్తోంది. ఈ నిబంధనలు పాటించడం వల్ల నిర్మాణ వ్యయం రెండు నుంచి మూడు శాతం పెరుగుతుందని, కానీ ఆ మొత్తం కరెంటు బిల్లులు లేకపోవడం ద్వారా నాలుగు నుంచి ఐదేళ్లలో తిరిగి పొందే అవకాశం ఉందని ఓ అధికారి వివరించారు.
20 సింగిల్ బెడ్ రూం ఇళ్లు లేదా 10 డబుల్ బెడ్ రూం ఇళ్లు కలిగి 100 కిలోవాట్ల లోడ్ కి పైగా వినియోగం కలిగిన కొత్త రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు ఈ కొత్త కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. 2030 నాటికి ఇంధన వినియోగానికి 45 శాతం మేర తగ్గించాలని దృఢ నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇంధన సంరక్షణ చట్టం ప్రకారం కేవలం వాణిజ్య భవనాలకు మాత్రమే ఈ కోడ్ వర్తిస్తుంది. ఇకపై దీనిని నివాస భవనాలకు కూడా వర్తింపచేయాలని సర్కారు నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇది అమల్లోకి రానుంది.
This website uses cookies.