Categories: LATEST UPDATES

రహేజా డెవలపర్‌పై ఎఫ్ఐఆర్

నిర్మాణాన్ని నాసిరకంగా కట్టినందుకు రహేజా డెవలపర్‌( Raheja developer )లపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సెక్టార్ 108 లోని వేదాంతకు సంబంధించి డీటీసీపీ దాఖలు చేసిన ఫిర్యాదుపై రహేజా డెవలపర్‌లపై కేసు నమోదు చేశారు. దీనిపై రహేజా డెవలపర్స్ ఎండీ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులో లేరు. హౌసింగ్ సొసైటీలో నాసికరమైన నిర్మాణం గురించి రహేజా వేదాంత నివాసితుల నుండి డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదులు అందాయి. పదేపదే నోటీసులు ఇచ్చినప్పటికీ, డెవలపర్ మరమ్మతు పనులు చేయడంలో విఫలమయ్యారు. ఇంతకు ముందు, హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కూడా డెవలపర్‌కి మరమ్మతు పనిని పూర్తి చేయాలని ఆదేశించింది.

సెక్టార్ 108 లోని 10.68 ఎకరాల భూమిలో డీటీసీపీ నుంచి రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ సొసైటీని నిర్మించేందుకు డెవలపర్ 2007లో లైసెన్స్ పొందారు. నిర్మాణ పనులు 2008 లో ప్రారంభమయ్యాయి మరియు డెవలపర్ 2014 నుండి గృహ కొనుగోలుదారులకు ఫ్లాట్లను అప్పగించారు. 2018 నుంచి నిర్మాణాత్మక సమస్యలున్నాయని నివాసితులు ఫిర్యాదులు చేయడం ఆరంభించారు. వేదాంత నివాసితుల సంఘం అధ్యక్షుడు గౌతమ్ సేన్ మాట్లాడుతూ, టవర్‌లలో ఒక బేస్‌మెంట్‌లో సీపేజీ స‌మ‌స్య ఆరంభ‌మైంద‌ని చెప్పారు. “స్తంభాలు, గోడలు మరియు టవర్ భవనాల ముఖభాగంలో క్రమంగా పగుళ్లు కనిపించడం ప్రారంభించాయి. డెవలపర్‌కు పదేపదే ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోలేదు. స్తంభాల్లో పగుళ్లు కారణంగా నిర్మాణాత్మక లోపాలు మరియు నిర్మాణాలను బలహీనపరుస్తుంద‌ని నిపుణుల తదుపరి ఆడిట్ క‌మిటీ సూచించింది.

This website uses cookies.