Categories: TOP STORIES

అప‌ర్ణా సైబ‌ర్ లైఫ్‌లో అగ్నిప్ర‌మాదం

న‌ల‌గండ్ల‌లో అప‌ర్ణా సైబ‌ర్ లైఫ్‌లో శుక్ర‌వారం రాత్రి అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ క‌మ్యూనిటీలో నివ‌సించే ఒక కుటుంబం దీపావ‌ళి షాపింగ్ కోసం బ‌య‌టికెళుతూ బెడ్‌రూములో గీజ‌ర్‌ను నిలిపివేయ‌డం మ‌ర్చిపోయారు. మ‌రోవైపు, క‌మ్యూనిటీలో దీపావ‌ళి కోసం విద్యుత్తు దీపాల‌ను అమ‌ర్చుతున్నార‌ని తెలిసింది. కొంత‌సేపు త‌ర్వాత చూస్తే విద్యుదాఘాతం సంభ‌వించింది. ఆయా ఫ్లాట్‌లోని రెండు గ‌దులు పూర్తిగా ద‌గ్ద‌మ‌య్యాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌క‌పోవ‌డంతో కమ్యూనిటీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గేటెడ్ క‌మ్యూనిటీల్లో నివ‌సించేవారిలో ఏ ఒక్క‌రూ చిన్న త‌ప్పు చేస్తే.. కొన్ని సంద‌ర్భాల్లో అక్క‌డి చుట్టుప‌క్క‌ల వాళ్ల‌కు ఇబ్బందులు ఎదుర‌య్యే ప్ర‌మాద‌ముంది. కాబ‌ట్టి, నివాసితులంగా ఎల్ల‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌ర‌ముంది.

This website uses cookies.