Categories: LATEST UPDATES

ప్రీ లాంచ్‌లో కొన‌వ‌ద్దు

  • రియ‌ల్ ఎస్టేట్ గురు ఎఫెక్ట్‌
  • పుర‌పాల‌క శాఖ తాజా ఆదేశం

జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా.. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌ని
పుర‌పాల‌క శాఖ ఆదేశించింది. కొందరు బిల్డర్లు తమ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులూ లేకపోయినా.. కొనుగోలుదారులను ఆకర్షించి ఫ్లాట్లను విక్రయించేందుకు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్న విషయాన్ని రియల్ ఎస్టేట్ గురు వెలుగులోకి తెచ్చింది. దీనిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ స్పందించి ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ అనుమతులు లేని, రెరాలో రిజిస్టర్ కాని అపార్ట్ మెంటులను కొందరు బిల్డర్లు అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇందుకోసం సోషల్ మీడియా, ఇతర ప్రింట్ మీడియాల్లో ప్రకటనలు ఇస్తున్నట్టు తెలియవచ్చింది. అంతేకాకుండా కొన్ని చోట్ల కనీసం భూమి సైతం కొనుగోలు చేయకుండానే ప్రీ సేల్ ఆఫర్ పేరుతో ప్లాట్ల అమ్మకాలకు సంబంధించి ప్రకటనలు ఇస్తున్నట్టు తెలిసింది. రెరా చట్టం ప్రకారం బిల్డర్లు తమ ప్రాజెక్టుకు సంబంధిత అథార్టీ నుంచి తొలుత అనుమతులు పొందాలి. అలాగే రెరాలో రిజిస్టర్ చేసుకున్న తర్వాతే వాటి అమ్మకాలు జరపాలి. రెరాలో రిజిస్టర్ కాని ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసినవారి డబ్బుకు ఎలాంటి భద్రతా ఉండదు. అందువల్ల ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అనుమతులు లేని, రెరాలో రిజిస్టర్ కాని ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు లేదా ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేయొద్దు. బిల్డింగ్ లేదా లేఔట్ అనుమతులకు సంబంధించిన వివరాలు హెచ్ఎండీఏ లేదా జీహెచ్ఎంసీ వెబ్ సైట్లలో ఉంటాయి. అలాగే రెరా రిజిస్ట్రేషన్లు కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా వాటిని ఆయా విభాగాల కార్యాలయాల నుంచి కూడా పొందొచ్చు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

This website uses cookies.