Categories: LATEST UPDATES

తెలంగాణలో ఫ్లిప్ కార్ట్ విస్తరణ?

సంగారెడ్డిలో కొత్త ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్

దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్.. తెలంగాణలో విస్తరిస్తోంది. సంగారెడ్డిలో కొత్త ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ప్రారంభించడంతో ఆ సంస్థ సరఫరా చైన్ మరింత బలోపేతమైంది. మంత్రి కేటీఆర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొత్త సెంటర్ తో తెలంగాణలోని వేలాది మంది స్థానిక విక్రేతలు, ఎంఎస్ఎంఈలు అందించే ఫర్నిచర్, పెద్ద ఉపకరణాలతో సహా విస్తృత శ్రేణి ఉత్పత్తుల డెలివరీ, లాజిస్టిక్ కు ఎంతగానో దోహదపడనుంది. వారందరికీ జాతీయ మార్కెట్ మద్దతు లభించనుంది. సంగారెడ్డిలో కొత్తగా ప్రారంభమైన ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. తద్వారా తెలంగాణ ఆర్థిక వృద్ధికి తమ సరఫరా చైన్ కార్యకలాపాలు మరింతగా ఉపయోగపడతాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.

This website uses cookies.