దేశంలోని నగరాలకు సంబంధించిన ఏ రకమైన డేటానైనా పొందుపరచడం కోసం కేంద్రం నవంబర్ 13న ఓ వెబ్ పోర్టల్ ప్రారంభించింది. ఏఏఐఎన్ఏ డ్యాష్ బోర్డ్ ఫర్ సిటీస్ పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్ బీలు) తమ కీలక డేటానే క్రమం తప్పకుండా సమర్పించడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. డ్యాష్ బోర్డులో రాజకీయ, పరిపాలనా నిర్మాణంతోపాటు ఆర్థిక, ప్రణాళిక, పౌర కేంద్రీకృత పాలన, ప్రాథమిక సేవల పంపిణీ వంటి ఐదు అంశాలు ఉంటాయి. యూఎల్ బీలు డ్యాష్ బోర్డ్ పోర్టల్ కి లాగిన్ అయి తమ డేటాను సమర్పించాల్సి ఉంటుంది.