ఏ వ్యాపారంలోనైనా కస్టమర్ సర్వీస్ ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రం అలాంటి సేవలు లేవు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల సంతోషమే ధ్యేయంగా, వారి అవసరాలు, అభిరుచులు తెలుసుకుని, ఒకే విధమైన జీవితం కోరుకునేవారిని ఒక కమ్యూనిటీగా చేయడానికి కసరత్తు చేస్తూ రెలాయ్ పలువురి మన్ననలు అందుకుంటోంది. అదే సమయంలో వివిధ కంపెనీలతో జట్టు కట్టడం ద్వారా వారి అమ్మకాలనూ పెంచుతోంది. రిలాయ్ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పలు రియల్ ఎస్టేట్ బ్రాండ్లు తమ కొనుగోలుదారుల ప్రధాన అవసరాలను తీర్చడమే కాకుండా.. పలు ప్రయోజనాలను కల్పిస్తూ డిజిటల్ సౌకర్యాల యుగంలోకి ప్రవేశిస్తున్నాయి.
గృహ కొనుగోలుదారులు మార్కెట్ ను భావోద్వేగంతో సంప్రదిస్తే.. బిల్డర్లు యాంత్రికంగా ఆ పని చేస్తారు. ఫలితంగా బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య అగాధం ఎక్కువగా ఉంటోంది. నిజానికి కొనుగోలుదారుల ఆకాంక్షలు అందరివీ ఒకేలా ఉండవు. వాటిని బిల్డర్లు అధిగమించడం కష్టం. ఈ నేపథ్యంలో బిల్డర్లు ఈ సమస్యను అధిగమించడానికి, కొనుగోలుదారులకు చక్కని కొనుగోలు అనుభవం కలిగించడానికి రిలాయ్ తో జట్టుకడుతున్నారు. ఫలితంగా గత ఐదేళ్లలో వివిధ రియల్ ఎస్టేట్ బ్రాండ్ల రెఫరల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
‘సంతోషంగా ఉండే కస్టమరే తన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటారు. అందువల్ల కస్టమర్లను సాధ్యమైనంతగా సంతోషపెట్టడానికి మా శక్తిమేర మేం ప్రతిదీ చేస్తాం. అంటే వివిధ రకాల కస్టమర్లకు సంబంధించి విభిన్న అవసరాలను తీర్చడం అన్నమాట. సీనియర్ సిటిజన్లకు, యువతకు విభిన్నమైన వసువులు అవసరం. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లకు నిర్దిష్టమైన డిజిటల్ సౌకర్యాలు అందించడానికి మేం బిల్డర్లు, థర్డ్ పార్టీలతో కలసి పనిచేస్తాం. ఎక్కువ మంది సారూప్యత కలిగిన వ్యక్తులు కలిసి జీవించేలా చేయడం.. వివిధ రకాల సమూహాల చుట్టూ కమ్యూనిటీలను నిర్మించడమే మా లక్ష్యం’ అని రెలాయ్ ఫౌండర్, సీఈఓ అఖిల్ సరాఫ్ పేర్కొన్నారు.
గోద్రేజ్, శ్రీజన్, ఎస్పీఆర్ఈ సహా పలు బ్రాండ్ల కోసం లాయల్టీ ప్రోగ్రాములు, ఛానెల్ భాగస్వామి యాప్ లు విజయవంతంగా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ త్రైమానికంలో మరికొన్నింటిని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. రిలాయ్ తో ప్రతి బిల్డర్ కనెక్ట్ ఆర్ఈ యాప్ ద్వారా లాయల్టీ, రెఫరల్ అమ్మకాలు ఎక్కువగా పొందే అవకాశం ఉందని తెలిపారు. తమ క్లయింట్లలో ఒకరికి రెఫరల్ అమ్మకాల వృద్ధిని 6 శాతం నుంచి 16 శాతానికి పెంచగలిగినట్టు వెల్లడించారు. దీంతోపాటు తమ చానల్ పార్ట్ నర్ నెట్ వర్క్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, ఉత్పాదకతను రెండు రెట్లు పెంచడానికి బ్రాండ్ల కోసం ప్రత్యేకంగా విన్ఆర్ఈ యాప్ తీసుకొచ్చినట్టు వివరించారు. గతంలో లాయలీ పేరుతో పనిచేసిన రిలాయ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
This website uses cookies.