poulomi avante poulomi avante

జీవితంలో విజేత‌ల కోస‌మే.. టీమ్ 4 నైలా

  • మియాపూర్‌లో 35 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యం
  • 6.02 ఎక‌రాలు.. 3 ట‌వ‌ర్లు..
  • 1200- 1800 ఎస్ఎఫ్‌టీ
  • వ‌చ్చే ఏడాది ఆగ‌స్టులో హ్యాండోవ‌ర్‌

సాధారణ ప్రజలు.. సాధారణమైన ఆలోచనలతో.. సాదాసీదా ఇల్లుంటే చాలని సర్దుకుపోతారు. కానీ జీవితంలో విజేత‌లుగా నిల‌వాల‌నే ఉన్న‌త‌మైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న‌వారు.. అసాధారణమైన, అత్యుత్తమ ఇల్లు ఉండాల‌నే క‌ల‌లు కంటారు. మ‌రి, ఆ క‌ల‌ను నిజం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించేవారి కోసం.. మియాపూర్‌లో ముస్తాబవుతోన్న బ్యూటీఫుల్ ప్రాజెక్టే.. టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ నైలా. రెరా అనుమ‌తి పొందిన ఈ అల్ట్రా మోడ్ర‌న్ స్కై స్క్రేప‌ర్‌లో నివ‌సించ‌డ‌మంటే.. మీ జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవ‌డ‌మే!

హైద‌రాబాద్‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ.. కొనుగోలుదారుల మ‌న్న‌న‌ల్ని అందుకుంటున్న టీమ్ 4 లైఫ్ స్పేసెస్‌లో నాలుగు కీల‌క కంపెనీలే.. సైనీ, ప్రాస్ప‌ర్‌, యూలా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, మార్క‌ర‌స్. మ‌రి, టీమ్ ఫోర్ ప్ర‌త్యేక‌తల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టుకు పేరు పెట్ట‌డానికెంతో రిసెర్చ్ చేసింది. చివ‌రికి అర‌బిక్ భాష‌లో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టింది. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం. అంటే జీవితంలో రాజీలేని వైఖరితో, అన్నివేళలా గెలుపునకు స్ఫూర్తినిచ్చేందుకు.. అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును ఆరంభించింది. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో మూడు ఆకాశహర్మ్యాలను అతిచక్కగా డిజైన్ చేసింది.

టీమ్ ఫోర్ నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ మనసుకు హత్తుకునేదే. ప్రతి అంశం అత్యంత విలువైనదే. బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు.. ఎంత అధునాతనంగా రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్, ఔట్ డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. విజేత ఎప్పుడూ ఇతరుల కంటే ముందుగానే ఉండాలి. అందుకోసం వారి కంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా డిజైన్ని రూపొందించింది. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. నార్త్, ఈస్ట్ రెండు వైపులా రోడ్డు కలిగి ఉందీ ప్రాజెక్టు. అంత‌కంటే ఇంకెం కావాలో చెప్పండి.

ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటును అందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలూ కల్పిస్తోంది. ఆడండి.. విశ్రాంతి తీసుకోండి లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు.. మీరు కోరుకున్న ప్రతి అంశమూ నైలాలో ఉంది.

వినోదం, విశ్రాంతి, ఆటపాటల కోసం ఎన్నో సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన క్లబ్ హౌస్.. అందులో యువత కోసం ఆధునిక‌ స్విమింగ్ పూల్.. పక్కనే ఓవెలీ డెక్ సైడ్ సీటింగ్.. ఓసారి ఊహించుకోండి ఆ ప్రాంతం ఎంత బాగుందో? ఇక బిలియర్డ్స్, క్యారమ్, ఇండోర్ టేబుల్ టెన్నిస్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ స్క్వాష్ కోర్టు, వాలీబాల్ కోర్టు, వ్యాయామశాల, స్పా, మెడిటేషన రూమ్, యోగా స్టూడియో, ఏరోబిక్స్, మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, ట్యూషన్ రూమ్, గెస్ట్ సూట్స్, కో వర్కింగ్ స్పేస్, హాబీ రూమ్, కాఫీ షాప్, రెస్టారెంట్, పార్టీ టెర్రస్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రివ్యూ థియేటర్, వెయిటింగ్ లాంజ్ వంటివి ఎన్నో ఉన్నాయి.
అత్య‌వ‌స‌రాల్లో ఆస్ప‌త్రుల‌కు నైలా నుంచి నిమిషాల వ్య‌వ‌ధిలో చేరుకోవ‌చ్చు. అటు మ‌మ‌తా ఆస్ప‌త్రి, ఇటు మియాపూర్‌, నిజాంపేట్‌, కేపీహెచ్‌బీ కాల‌నీలోని హాస్పిట‌ల్స్‌కు ఇట్టే వెళ్లిపోవ‌చ్చు. షాపింగ్ మాళ్లు, మ‌ల్టీప్లెక్సులకు సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. లూలూ మాల్‌, ఫోరం మాల్‌, జీఎస్ఎం మాల్‌.. జీపీఆర్, మిరాజ్ సినిమాస్‌, పీవీఆర్ ఐనాక్స్‌, సినీపోలిస్ వంటి మ‌ల్టీప్లెక్సుల‌తో బాటు సింగిల్ థియేట‌ర్లు స‌మీపంలోనే ఉన్నాయి.
మియాపూర్ నైలా ప్రాజెక్టు నుంచి జేఎన్టీయూకి 13 నిమిషాల్లో, కొండాపూర్ కి 15 నిమిషాల్లో, హైటెక్ సిటీ, ఉషా ముళ్లపూడి హాస్పటల్ కు 20 నిమిషాల్లో, గ‌చ్చిబౌలికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles