అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యల్ని తీసుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్మాణాలపై మున్సిపల్ సిబ్బంది సంబంధిత వ్యక్తులకు నోటీసులిస్తే వారు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారని తెలిపారు. దీంతో, మున్సిపల్ అధికారులు అలాంటి వారిపై కఠిన చర్యల్ని తీసుకోలేకపోతున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని గవర్నర్ తమిళిసై కి ఆయన తాజాగా లేఖ రాశారు. 2016లో జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపల్ బిల్డంగ్ ట్రిబ్యునల్ కు ఛైర్మన్, మెంబర్లను నియమించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
ట్రిబ్యునల్ పై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఆరు సంవత్సరాల నుంచి పరిశీలనలో ఉందనే సమాధానమే వస్తుందని తెలిపారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల్ని నిర్మించి ప్రజలకు విక్రయిస్తున్నారని.. వాటిని కొన్న తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.
This website uses cookies.