హైదరాబాద్‌లో కొందరు బిల్డర్లు ఎంత బరి తెగించారో ఈ ఫోటోను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. హెచ్ఎండీఏ, రెరా అథారిటీ అనుమతి లభించకుండానే.. వాటి లోగోలను ముద్రించి.. ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఆదిభట్లలో టీసీఎస్ పక్కనే స్కైలైన్ హోమ్స్ అనే ఈ ప్రాజెక్టును ఎస్వీ కన్ స్ట్రక్షన్స్ అనే సంస్థ నిర్మిస్తోంది. ఈ బిల్డర్ ఎంత బరితెగించాడంటే.. రెరా అనుమతి రాకుండానే.. రెరా లోగోను ముద్రించి మరీ ఫ్లాట్లను విక్రయిస్తున్నారు.
కాబట్టి, కొనుగోలుదారులు ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని రెరా తెలియజేస్తోంది. ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రకటన మీద రెరా నెంబరు ఉంటేనే దానికి రెరా అనుమతి లభించినట్లు అని వెల్లడించింది. కొందరు అక్రమార్కులు చేస్తున్న మోసపూరిత ప్రకటనలు తమ దృష్టికి వచ్చాయని అంటోంది. తమ అనుమతి లేకుండానే లోగో ముద్రించిన ఎస్వీ కన్‌స్ట్రక్షన్స్ పై జరిమానా విధిస్తామని తెలియజేసింది.
This website uses cookies.