ఓ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న రెరా కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చర్యలు చేపట్టింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న 65 మంది డెవలపర్లలో 40 మంది డెవలపర్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. అంతే కాకుండా ఈ డెవలపర్లకు సంబంధించిన ప్లాట్లు లేదా ఫ్లాట్ల బదిలీని నిలిపివేయాలని ల్యాండ్ రెవెన్యూ, ఇతర విభాగాలను కోరింది. ఆయా భవనాలన్నీ నకిలీ పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించి నిర్మించినవని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ అక్రమ భవనాల్లో చాలా ఫ్లాట్లను డెవలపర్లు ఇప్పటికే విక్రయించారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత మంది ఇవి కొని మోసపోకుండా చూసే ఉద్దేశంతో వీటి అమ్మకాల లావాదేవీలను నిలిపివేయించినట్టు చెప్పారు. అలాగే ఈ 65 భవనాలకు సంబంధించిన స్టక్చరల్ ఆడిట్ నివేదికను ఇవ్వాల్సిందిగా కల్యాణ్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ ను సిట్ కోరింది.
This website uses cookies.