Categories: TOP STORIES

రుణగ్రహీతలకు గుడ్ న్యూస్

  • వడ్డీ రేట్లలో ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్ డ్ కు
    మారేందుకు ఆర్బీఐ వెసులుబాటు

అంతకంతకూ పెరుగుతూ భారంగా మారిన వడ్డీ రేట్ల విషయంలో రుణగ్రహీతలకు ఊరట కల్పించేలా రిజర్వు బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహ, ఆటో ఇతర రుణాలకు సంబంధించిన రుణగ్రహీతలు ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్ డ్ రేట్ విధానానికి మారే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే విధానాన్ని త్వరలో ప్రకటిస్తానని పేర్కొంది.

ఈ విధానం కింద బ్యాంకులు… రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ ‍గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకురావడంతోపాటు రుణగ్రహీతలు ఫిక్స్ డ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలపై ఆర్బీఐ విధివిధానాలు జారీ చేస్తుంది.

This website uses cookies.