Categories: PROJECT ANALYSIS

కోకాపేట్లో జెమ్ ప్రాజెక్ట్!

హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన కోకాపేట్లో సరికొత్త రత్నం లాంటి ప్రాజెక్టు ఆరంభమైంది. అదే.. జెమ్ నక్షత్ర. సుమారు 4.7 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ నిర్మాణం ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. వాటిని తెలుసుకుంటే మీరు వెంటనే మీకు నచ్చిన ఫ్లాట్ ను బుక్ చేసేస్తారు.

కోకాపేట్ నుంచి అటు గచ్చిబౌలి కానీ ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు కానీ ఎంతో చేరువగా ఉంటాయి. పైగా, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మెగా టౌన్ షిప్ కూడా ఇక్కడే రానున్నది. అక్కడి వరకూ మెట్రో ట్రెయిన్ సదుపాయాన్ని కూడా కల్పించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఇది సాకారమైతే.. కోకాపేట్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది.

కోకాపేట్లో హెచ్ఎండీఏకు 630 ఎకరాల స్థలముండగా.. అందులో 166 ఎకరాల్ని వేలంలో విక్రయించింది. వంద ఎకరాల్ని ప్రముఖ ఐటీ కంపెనీలకు అందజేసింది. ఈ వంద ఎకరాల్లో నిర్మించే ఐటీ సముదాయాల్లో. వచ్చే రెండు, మూడేళ్లలో ఎంతలేదన్నా లక్ష మంది దాకా ఉద్యోగులు పని చేసే వీలుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ ఎక్కువ కాలం కొనసాగితే ఇంతమంది ఉంటారు. ఇంటి నుంచి పని చేసే సౌలభ్యం కంపెనీలు వద్దనుకుంటే మాత్రం ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి అభివ్రుద్ధిని ద్రుష్టిలో పెట్టుకుని.. జెమ్స్ సంస్థ కోకాపేట్లో జెమ్స్ నక్షత్ర అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించింది. ఇప్పటికే మొదటి బ్లాకు పనులు జోరుగా జరుగుతున్నాయి.

3 టవర్లు.. 576 ఫ్లాట్లు..

జెమ్ నక్షత్ర ప్రాజెక్టును మొత్తం 4.7 ఎకరాల్లో సంస్థ నిర్మిస్తోంది. మూడు టవర్లు కలిపి మొత్తం 576 ఫ్లాట్లు వస్తాయి. రెండు సెల్లార్లు ప్లస్ స్టిల్ట్ ప్లస్ 18 అంతస్తుల ఎత్తులో మూడు టవర్లను కడుతున్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం 1220 నుంచి 1820 చదరపు అడుగుల దాకా ఉంటాయి. ధర విషయానికొస్తే, రూ.75 లక్షల నుంచి ప్రారంభం. 27వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తోన్న క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో పొందుపర్చని ఆధునిక సదుపాయమంటూ లేదని చెప్పొచ్చు. బాస్కెట్ బాల్ కోర్టు, స్కేటింగ్ రింక్, యాంఫి థియేటర్, చిన్నారులకు ప్రత్యేకంగా ఆడుకునే ఎక్విప్ మెంట్, మల్టీపర్పస్ హాల్, క్రెష్, జిమ్, ప్రీవ్యూ థియేటర్, స్విమ్మింగ్ పూల్, స్వ్కాష్ కోర్టు వంటివన్నీ ఏర్పాటు చేస్తారు.

జెమ్ నక్షత్ర ప్రాజెక్టు చుట్టుపక్కల అనేక ప్రాజెక్టులున్నాయి. చేరువలోనే అంతర్జాతీయ స్కూళ్లున్నాయి. ఇక్కడ్నుంచి విప్రో సర్కిల్, మైక్రోసాఫ్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాంటినెంటల్ ఆస్పత్రి కేవలం నాలుగు కిలోమీటర్లలోనే ఉంటుంది.

This website uses cookies.