జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్ రోస్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వ్యులను జారీ చేశారు. ఇప్పటివరకూ ఆయన ఆర్థిక శాఖలో కార్యదర్శిగా విధుల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వ్యవహరించిన లోకేష్ కుమార్‌ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్లుగా పని చేసే అధికారులంతా.. ఏదో ఒక అంశంలో తమ ప్రత్యేకతను నిరూపించారు. లోకేష్ కుమార్ మాత్రం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఎక్కడ తన ప్రత్యేకతను చాటి చెప్పలేదని సమాచారం. గత కమిషనర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిశోర్ తర్వాత.. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. కొత్త కమిషనర్ రోనాల్డ్ రోస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశముందని.. సరికొత్త దిశగా జీహెచ్ఎంసీని అభివృద్ధి చేసే అవకాశముందని తెలిసింది. ఏదీఏమైనా, ఆయన పనితీరు ఎలా ఉంటుందో అతిత్వరలో తెలుస్తుంది.
This website uses cookies.