నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి వివిధ విభాగాల నుండి అవసరమైన అనుమతులతో కూడిన ఆమోదం కోసం క్రమబద్ధీకరించబడిన ప్రక్రియల అవసరాన్ని నొక్కి చెబుతుంది.
HYDERABAD: 7th July, 2023: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధిని కొనసాగించేందుకు డెవలపర్‌లకు తగిన అనుమతులను అందించడానికి అవసరమైన 20 కంటే ఎక్కువ విభాగాల అధిపతులను సచివాలయంలో ఒకచోట చేర్చటం ద్వారా తెలంగాణ ప్రభుత్వ, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి చేసిన ప్రయత్నాలను కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NAREDCO), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (TBF), మరియు తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (TDA) ప్రశంసించాయి.
క్రెడాయ్ చొరవతో రియల్ ఎస్టేట్ పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశం తెలంగాణలోనే తొలిసారి. డెవలపర్‌ల బాధలను అర్థం చేసుకోవడం మరియు సమస్యలకు తగిన పరిష్కారాలను అన్వేషించడం, రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి TS-BPass ప్లాట్‌ఫారమ్‌లో అవసరమైన అనుమతులను ఏకీకృతం చేయడం వంటి వాటిని విశ్లేషించడం ఈ సమావేశం యొక్క ఉద్దేశ్యం.
అత్యున్నత స్థాయి ఈ అధికార ప్రతినిధి బృందంలో MA&UD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు అడిషనల్ ఛార్జ్ – చీఫ్ కమీషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిట్టల్, తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TS RERA), చైర్ పర్సన్ ఎన్ సత్యనారాయణ, కమిషనర్ GHMC, HMDA, HMWS&SB, GST, చీఫ్ EO, TS-Bpass, DG – Fire & Disaster Management, MD – TSSPDCL, IG – స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ, TSIIC తో పాటుగా నీటిపారుదల, మైనింగ్, పర్యావరణం, కాలుష్య నియంత్రణ, కార్మిక మరియు వివిధ కలెక్టరేట్ మరియు పోలీసు శాఖల అధికారులు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తరపున క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పి రామకృష్ణారావు, తెలంగాణ నరెడ్కో ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి వి రావు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి ప్రభాకర్ రావు , క్రెడాయ్ హైదరాబాద్- వైస్ ప్రెసిడెంట్, జి ఆనంద్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ట్రెజరర్ ఆదిత్య గౌరా, మరియు విజయ్ సాయి మేక, సెక్రటరీ జనరల్, NAREDCO తెలంగాణ పాల్గొన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి రామకృష్ణారావు మాట్లాడుతూ“ TS ప్రభుత్వంలోని దాదాపు 20 శాఖలకు చెందిన అధికారులతో ఈ సమన్వయ కమిటీ సమావేశాన్ని సులభతరం చేసినందుకు ప్రధాన కార్యదర్శికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది ఒక ప్రధాన కార్యక్రమం గా ఉండటం తో పాటుగా సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని పరిష్కరించడానికి తగిన ప్రయత్నం చేయడానికి వారి ఆందోళన మరియు ఆసక్తిని చూపుతుంది. TS-Bpass వంటి వ్యవస్థలను అవలంబించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందుంది, అయినప్పటికీ వ్యవస్థ లో ఇబ్బందులు లేకుండా చేయడానికి ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మేము మాస్టర్‌ప్లాన్, ధరిణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను హైలైట్ చేసాము మరియు తీవ్రస్థాయి అస్పష్టత వలన అనుమతులలో జాప్యం అవుతుండటం వలన ప్రక్రియలను మరింత క్రమబద్ధీకరించడంలో సహాయపడటానికి సూచనలు అందించాము. దరఖాస్తుదారుల సందేహాలను పరిష్కరించడానికి, సమస్యలను సత్వర పరిష్కారానికి మరియు వేగంగా అమలు చేయడానికి సాంకేతిక హెల్ప్‌డెస్క్‌లను సెటప్ చేయాలని మేము GHMC మరియు HMDA రెండింటినీ అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు ప్రాజెక్ట్ ఆమోదాలను వేగవంతం చేయడానికి, చట్టబద్ధమైన ప్రాజెక్ట్ ఆమోదాలను ప్రతిబింబించేలా TS-Bpass ప్లాట్‌ఫారమ్‌ను TS RERA ప్లాట్‌ఫారమ్‌లతో పూర్తి అనుసంధానించటం కోసం కూడా మేము అభ్యర్థించాము. TS ప్రభుత్వ అధికారులు మా ఆందోళనలకు సానుకూలంగా స్పంచించారు మరియు ప్రతినిధులు ఈ సమస్యలను జాబితా చేశారు. రాష్ట్రంలో వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపరచడంలో సహాయపడటానికి రాబోయే కాలంలో సానుకూల పురోగతిని చూడగలమని మేము ఆశిస్తున్నామ”ని అన్నారు.
This website uses cookies.