-
8.3 ఎకరాలు.. 4 టవర్లు
-
11 బ్లాకులు.. స్కై విల్లాలు
-
జోరుగా నిర్మాణ పనులు
హైదరాబాద్ నగరానికి చెందిన జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా కొల్లూరులో ఆరంభించిన ప్రాజెక్టే.. జీహెచ్ఆర్ కలిస్టో. సుమారు 8.3 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి నాలుగు టవర్లు. అందులో పదకొండు బ్లాకులను నిర్మిస్తారు. ఒక్కో బ్లాకును 18 అంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు. 1195 చదరపు అడుగుల నుంచి 1915 చదరపు అడుగుల్లో.. 2, 3, 4 బీహెచ్ కే ఫ్లాట్లను కడుతున్నారు. మొత్తం నిర్మించే ఫ్లాట్ల సంఖ్య.. ఎంతలేదన్నా 1190 అపార్ట్ మెంట్ల దాకా ఉంటాయి. అంతేకాదు, 3300 చదరపు అడుగుల నుంచి 3385 చదరపు అడుగుల్లో స్కై విల్లాలు కూడా ఉండటం విశేషం.
ఆధునిక సౌకర్యాలతోపాటు ఇందులో జీవించే వారి జీవన శైలిని మరింత మెరుగ్గా చేయడం కోసం ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన క్లబ్ హౌస్ డిజైన్ చేశారు. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్ హౌస్ లో.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో తీరిక సమయాన్ని ఉల్లాసంగా, ఉత్తేజంగా గడిపేందుకు.. బోలెడు ఇండోర్ గేమ్స్ కు స్థానం కల్పించారు. స్విమింగ్ పూల్, క్రికెట్, జిమ్, స్పా వంటివి ప్రతిఒక్కరికీ సరికొత్త ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మూడు స్విమింగ్ పూల్స్, 24 గంటల సెక్యూరిటీ, యాంఫి థియేటర్, వర్క్ ఫ్రం హోం కో వర్కింగ్ స్పేసెస్, ఇండోర్, ఔట్ డోర్ స్పోర్ట్స్ వంటివి అమితంగా ఆకర్షిస్తాయి.